నవీన్‌చంద్ర, అవికాగోర్ అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రో’. కార్తిక్ దర్శకుడు. జె.జె.ఆర్ రవిచంద్ర నిర్మాత. సాయిరోనక్, సంజన సారథి ప్రధాన పాత్రధారులు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను అగ్రకథానాయిక రష్మిక మందన్న ఇటీవల విడుదలచేసింది. నిర్మాత మాట్లాడుతూ ‘అన్నాచెల్లెళ్ల అనుబంధంతో ముడిపడిన చిత్రమిది. ఎమోషనల్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిస్తున్నాం. కథ నచ్చి నవీన్‌చంద్ర, అవికాగోర్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: అజీమ్ మహ్మద్.