నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రీత్’. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకుడు. నందమూరి జయకృష్ణ నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఇదొక ఎమోషనల్ థ్రిల్లర్. అన్ని వర్గాల వారిని అలరించే విధంగా వుంటుంది’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. సినిమా చూస్తున్నంత సేపు షాక్‌గా, సర్ప్రైజింగ్గా,థ్రిల్‌గా ఫీలవుతారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన యూనిక్ థ్రిల్లర్ ఇది’ అన్నారు.