Boney Kapoor | శ్రీదేవి చిరకాల కోరిక నెరవేర్చిన బోనీకపూర్.. అదేంటో తెలుసా..?
Boney Kapoor | దుబాయ్‌లో ఎవరూ ఊహించని స్థితిలో ఆకస్మిక మరణం చెంది.. భర్త బోనీకపూర్ (Boney Kapoor) కూతుళ్లు జాన్వీకపూర్, ఖుషీ కపూర్‌తోపాటు అభిమానులను, మూవీ లవర్స్‌ను తీరని శోకసంద్రంలో ముంచేసింది దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sri Devi).
Boney Kapoor | తన అందం, అభినయంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొని.. అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది దివంగత అలనాటి అందాల తార శ్రీదేవి (Sri Devi). దుబాయ్‌లో ఎవరూ ఊహించని స్థితిలో ఆకస్మిక మరణం చెంది.. భర్త బోనీకపూర్ (Boney Kapoor), కూతుళ్లు జాన్వీకపూర్, ఖుషీ కపూర్‌తోపాటు అభిమానులను, మూవీ లవర్స్‌ను తీరని శోకసంద్రంలో ముంచేసింది. శ్రీదేవి తాను లేని లోటును తీర్చేందుకు జాన్వీకపూర్‌ను తన నటవారసులిగా ప్రేక్షకులకు అందించింది.
శ్రీదేవి 80స్లో కెరీర్ జోష్‌మీదున్న సమయంలో చెన్నైకి సమీపంలోని మహాబలిపురం ఈస్ట్ కోస్ట్ రోడ్లో బీచ్ దగ్గర ఐదెరకాల ప్రాపర్టీ కొనుగోలు చేసింది. అయితే బీచ్ పేస్‌లో డ్రీమ్ హౌస్(హోటల్) నిర్మించుకోవాలనే కోరిక తీరకుండానే అందరినీ విడిచిపోయింది. తన సతీమణి చిరకాల కోరికను ఆమె భర్త, పాపులర్ నిర్మాత బోనీకపూర్ నెరవేర్చారు.
శ్రీదేవి చనిపోయిన ఐదేళ్ల తర్వాత తాజ్ గ్రూప్ పార్ట్నర్షిప్లో హోటల్‌గా అభివృద్ధి చేశారు. దీని గురించి బోనీకపూర్ మాట్లాడుతూ.. ఇది శ్రీదేవి కల. శ్రీదేవి డ్రీమ్‌ను నెరవేర్చేందుకు రెండేళ్లుగా డెవలప్మెంట్ పనులు చేపట్టి.. ఫైనల్‌గా బీచ్ హౌస్‌ను పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. శ్రీదేవి డ్రీమ్ హౌస్ లొకేషన్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
శ్రీదేవి తెలుగులో లీడింగ్ హీరోలతో నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకుందని తెలిసిందే. తల్లి బాటలో పయనిస్తూ.. తొలిసారి జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటిస్తోన్న దేవర సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది జాన్వీకపూర్. ఇప్పటికే విడుదలైన జాన్వీకపూర్ దేవర లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
శ్రీదేవి బీచ్ హౌజ్‌పై ఓ లుక్కేయండి మరీ..
Boney Kapoor is happy to fulfilling Sri Devi’s dream. He says, “Fulfilling Sri’s dream, it’s been almost 2yrs since I started developing her beach house.”@BoneyKapoor pic.twitter.com/0d6ellj6wf
— BA Raju’s Team (@baraju_SuperHit) August 20, 2023
In the late 80’s during the peak of her career, Late #SriDevi bought a 5 acre beach facing property at Mahabalipuram East Coast Road near Chennai.
Five years after her demise, he husband, popular producer #BoneyKapoor developed the property as a hotel in partnership with the… pic.twitter.com/zQRupt7gmN
— BA Raju’s Team (@baraju_SuperHit) August 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

