మరోసారి మెగా కంపౌండ్‌లోకి బొమ్మరిల్లు భాస్కర్.. నెక్ట్స్ సినిమా ఆయనతోనే..

Bommarillu Bhaskar | బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా సంచలన ఎంట్రీ ఇచ్చిన భాస్కర్ .. ఆ తర్వాత ఆ జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు. బొమ్మరిల్లు తర్వాత అల్లు అర్జున్‌తో చేసిన పరుగు సినిమా ఫర్లేదు అనిపించింది కానీ సూపర్ హిట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆరెంజ్, ఒంగోలు గిత్త సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. తమిళంలో బెంగళూరు నాట్కల్ అని తీసినా అది కూడా వర్కవుట్ కాలేదు. ఒక్కముక్కలో చెప్పాలంటే బొమ్మరిల్లు తర్వాత 14 సంవత్సరాల పాటు భాస్కర్ ఖాతాలో మరో హిట్ లేదు. ఇన్ని సంవత్సరాలకు 2021లో అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో విజయం అందుకొన్నాడు భాస్కర్. దీంతో ఇప్పుడు మళ్లీ సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో బొమ్మరిల్లు భాస్కర్ తర్వాత సినిమా ఎవరితో ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పెళ్లి చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి అనే కాన్సెప్టుతో ఈ కథ రాసుకున్నాడు భాస్కర్. యువతకు నచ్చేలా.. కుటుంబ ప్రేక్షకులను అలరించేలా బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. గీతా ఆర్ట్స్ 2 నిర్మించిన ఈ సినిమా 23 కోట్లకు పైగా వసూలు చేసి మంచి విజయం అందుకుంది. అఖిల్ అక్కినేనికి తన కెరీర్లో ఇది మొదటి విజయం. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ కోసం మళ్లీ నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఈయన తర్వాత సినిమా ఎవరితో చేయబోతున్నాడని టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీనికి సమాధానంగా మెగా కాంపౌండ్ పేరు వినిపిస్తుంది. ఇప్పటికే రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేశాడు బొమ్మరిల్లు భాస్కర్ . ఇప్పుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా చేయడానికి ఆయన కథ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలో ఈ సినిమా రానుంది. త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం బయటకు రానుంది.
ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ ఈ మధ్య కొండ పొలం సినిమాతో వచ్చాడు. అయితే ఇది అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు వైష్ణవ్ తేజ్. మరి ఇవన్నీ పూర్తయ్యే వరకు బొమ్మరిల్లు భాస్కర్ వేచి చూస్తాడా లేదా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
దృశ్యం పాపను గుర్తుపట్టారా ? ఇంతలా మారిపోయిందేంటి?
బొమ్మరిల్లు భాస్కర్‌కు ఎందుకు అంత గ్యాప్ వచ్చింది?
Bommarillu : జెనీలియా చేయనంటే బన్నీనే ఒప్పించాడట..!
బొమ్మరిల్లు సినిమా మిస్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసా..?
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఓటీటీ రిలీజ్ పై అల్లు అరవింద్ క్లారిటీ
ఉప్పెన 2 సినిమాపై దర్శకుడు బుచ్చి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

