బన్నీ పక్కన ఛాన్స్.. పరువు కోసం సినిమా ఛాన్స్ వదులుకున్న బాబీ

బలుపు, జై లవకుశ, వెంకీమామ వంటి చిత్రాల దర్శకుడు కెఎస్.రవీంద్ర (బాబీ) తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. త్వరలో ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. అయితే బాబీకి రాఘేంద్రరావు తెరకెక్కంచిన గంగోత్రి సినిమాలో బన్నీ పక్కన నటించే ఛాన్స్ దక్కిందట. కాని పరువు పోతుందేమోననే భయంతో నటనకు దూరమై రచయితగా, దర్శకుడిగా స్థిరపడ్డాడు.
బాబీ గుంటూరులో చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రైటర్ చిన్ని కృష్ణ ప్రత్యేకంగా అతన్ని కలిసి హైదరాబాద్ వచ్చినప్పుడు కలమని చెప్పాడట. అలా చిన్నికృష్ణని బాబీ కలవగా,అతడు రాఘవేంద్రరావు దగ్గరకి తీసుకెళ్లాడట. వెంటనే గంగోత్రి చిత్రంలో బన్నీ ఫ్రెండ్ ఛాన్సిచ్చాడు. అయితే బాబీ నిక్కర్ వేసుకోవాలని అందుకోసం కొలతలు తీసుకోమ్మన్ని సహాయక దర్శకుడికి చెప్పారట. నిక్కర్ వేసుకుంటే గుంటూరులో తన పరువు పోతుందని బాబీ వెంటనే ఆ ఆఫర్ వద్దని అన్నాడట.మరి ఏం చేస్తావని చిన్ని కృష్ణ అడిగితే కథలు రాస్తానని అన్నాడట. దీంతో గంగోత్రికి పలు సీన్స్ రాయడం వారికి ఎంతగానో నచ్చడం జరిగింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

