Bigg Boss | బిగ్ బాస్ హౌస్‌లో ఇన్ని ఇబ్బందులా .. షో వెనుక అసలు విషయాలు బయటపెట్టిన దక్షి!
Bigg Boss | బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్కులు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే తెరపై కనిపించే సందడి వెనుక కంటెస్టెంట్లు ఎదుర్కొనే ఇబ్బందులు మాత్రం చాలామందికి తెలియవు.
Bigg Boss | బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, టాస్కులు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే తెరపై కనిపించే సందడి వెనుక కంటెస్టెంట్లు ఎదుర్కొనే ఇబ్బందులు మాత్రం చాలామందికి తెలియవు. తాజాగా షో నుంచి బయటకు వచ్చిన దక్షి గుత్తికొండ హౌస్‌లో తమకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్‌లో కంటెస్టెంట్లు అందంగా ముస్తాబై కనిపిస్తుంటారు. దీంతో వారికి మేకప్ చేసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారా? రెడీ అవ్వడానికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో తలెత్తుతుంటాయి.
అయితే దక్షి చెప్పిన వివరాల ప్రకారం, హౌస్‌లో కంటెస్టెంట్లు తమ వ్యక్తిగత పనులను తామే చేసుకోవాలి. మేకప్ వేసుకోవడం, దుస్తులను శుభ్రం చేసుకోవడం వంటి పనులకు స్వయంగా సమయం కేటాయించాలి. కనుబొమ్మలను సరిచేసుకునేందుకు రేజర్లు, గోళ్లు కత్తిరించుకునేందుకు నెయిల్ కట్టర్లు వంటి అవసరమైన వస్తువులను పరిమితంగా అందిస్తారని ఆమె వివరించారు. మహిళా కంటెస్టెంట్లకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి దక్షి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా చర్చకు వచ్చాయి. రుతుస్రావం సమయంలో అవసరమైన శానిటరీ ప్యాడ్లను హౌస్‌కు అందిస్తారని, అదనంగా కావాల్సి వస్తే సిబ్బందిని అడిగి తెప్పించుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. నెలసరి కారణంగా శారీరక అసౌకర్యం ఎదురైనా టాస్కుల్లో పాల్గొనాల్సిన పరిస్థితులు ఉంటాయని, ఈ విషయంలో ప్రత్యేక మినహాయింపు ఉండదని ఆమె పేర్కొన్నారు.
బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లకు ఆటలు, వినోదం మాత్రమే కాకుండా నిద్ర, ఆహారం విషయంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయని దక్షి వెల్లడించారు. ముఖ్యంగా నాన్‌వెజ్ సరిపడా అందకపోవడం వంటి సమస్యలను ఆమె ప్రస్తావించారు. ఇక సమయాన్ని తెలుసుకోవడానికి గడియారం అందుబాటులో లేని పరిస్థితుల్లో, బయట నుంచి వినిపించే మెట్రో రైలు శబ్దాలను ఆధారంగా చేసుకునేవారమని చెప్పారు. చివరి రైలు ఎప్పుడు వెళ్లిందనే దాన్ని బట్టి నిద్రపోయే సమయాన్ని అంచనా వేసుకునేవారమని వివరించారు.మొత్తంగా బిగ్ బాస్ హౌస్‌లో కెమెరాల ముందు కనిపించే సందడి వెనుక కంటెస్టెంట్లు ఎదుర్కొనే రోజువారీ సవాళ్లను దక్షి వ్యాఖ్యలు బయటపెట్టాయి. షోలో పాల్గొనడం అంటే కేవలం టాస్కులు ఆడటం మాత్రమే కాదని, వ్యక్తిగత అవసరాలను నిర్వహించుకోవడం నుంచి నిద్ర, ఆహారం వరకు ఎన్నో విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుందని ఆమె అనుభవాలు తెలియజేస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bigg boss 10
- dakshi
- Games
- Nagarjuna
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | మల్లన్నసాగర్‌కు అతీ సమీపంలో బ్లాస్టింగ్లు.. ప్రమాదంలో రిజర్వాయర్ : మాజీ మంత్రి హరీష్‌రావు ఆందోళన
Bigg Boss | బిగ్ బాస్ హౌస్‌లో ఇన్ని ఇబ్బందులా .. షో వెనుక అసలు విషయాలు బయటపెట్టిన దక్షి!
టేకులపల్లిలో కటారుసుం వేలం
Mailurayi | నాగబాబు చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. నిర్మాతగా శ్రీ హన్సిక!
KTR | రాష్ట్రం కరువులో ఉంటది.. కానీ సుందరీకరణ మాత్రం ఆగదు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

