Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 50వ రోజు నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మరోసారి మొదలైంది. ముఖ్యంగా త్రిగుణ్, రోహిత్ మధ్య జరిగిన వాగ్వాదం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. షాలినితో తనకున్న అనుబంధం గురించి రోహిత్ చెప్పిన మాటలు ఈ ఎపిసోడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 50వ రోజు నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా సాగింది. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం మరోసారి మొదలైంది. ముఖ్యంగా త్రిగుణ్, రోహిత్ మధ్య జరిగిన వాగ్వాదం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. షాలినితో తనకున్న అనుబంధం గురించి రోహిత్ చెప్పిన మాటలు ఈ ఎపిసోడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం జరిగిన నామినేషన్ల ప్రక్రియలో బిగ్‌బాస్ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. గ్రీన్ లెవల్లో ఉన్న త్రిగుణ్, దేబ్జానీ, ముకేశ్, అమన్, నీతూ మాత్రమే ఇతరులను నామినేట్ చేసే అవకాశం కల్పించారు. ఈ ఐదుగురు చర్చించుకుని ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలనే విషయాన్ని నిర్ణయించుకున్నారు.
అమన్, దేబ్జానీ, నీతూ, ముకేశ్ ఒక్కొక్కరిని నామినేట్ చేయాలని నిర్ణయించుకోగా.. త్రిగుణ్ మాత్రం ముగ్గురిని నామినేట్ చేసే బాధ్యత తీసుకున్నారు. ముందుగా నీతూ తన నామినేషన్లో ఝాన్సీని ఎంచుకున్నారు. గేమ్స్ బాగా ఆడుతున్నప్పటికీ హౌస్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అనంతరం ముకేశ్.. ఆర్కేను నామినేట్ చేశారు. హౌస్‌లో రోబోట్లా తిరుగుతున్నావని, ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు గట్టిగా అరిచి ఆ తర్వాత మౌనంగా ఉంటున్నావని విమర్శించారు. నీకు స్పష్టమైన అభిప్రాయం లేదని తన నామినేషన్‌కు కారణం చెప్పారు.
ఆ తర్వాత త్రిగుణ్ తన నామినేషన్లతో హౌస్‌లో చర్చకు తెరలేపారు. మొదట రామ్ ప్రసాద్‌ను నామినేట్ చేశారు. కెప్టెన్‌గా ఉన్న సమయంలో అందరితో చాలా సాఫ్ట్‌గా వ్యవహరించారని, కెప్టెన్‌కు ఉండాల్సిన అధికారాన్ని ప్రదర్శించలేకపోయారని విమర్శించారు. తన రెండో నామినేషన్లో రోహిత్‌ను ఎంచుకున్న త్రిగుణ్.. అగ్నిపరీక్ష సమయంలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు అతడిలో లేదని అన్నారు. బిగ్‌బాస్‌కు, హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లకు మర్యాద ఇవ్వడం లేదని ఆరోపించారు. అంతేకాకుండా ఇతరులను కించపరుస్తూ మాట్లాడుతున్నావని, నీకు అంత అహంకారం ఎందుకని ప్రశ్నించారు.
త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలకు రోహిత్ గట్టిగానే సమాధానమిచ్చారు. త్రిగుణ్ స్థాయికి దిగజారి మాట్లాడటం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. తనకు మర్యాద లేదని విమర్శిస్తున్నారని, కానీ తన ప్రవర్తన వెనుక ఉన్న భావోద్వేగాలను అర్థం చేసుకోవాలని అన్నారు. ముఖ్యంగా షాలిని హౌస్ నుంచి వెళ్లిపోతున్న సమయంలో ఆమెకు ముద్దు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో తాను చాలా భయపడ్డానని, షాలిని వెళ్లిపోతే హౌస్‌లో ఒంటరివాడిని అయిపోతానేమోనని ఆందోళన చెందానని వెల్లడించారు.
షాలినితో తనకున్న అనుబంధం గురించి వివరిస్తూ.. ఆమెకు మూడు చపాతీలు వచ్చినప్పుడు రెండే తిని, మిగిలిన ఒక చపాతీ తనకు ఇచ్చేదని రోహిత్ గుర్తుచేసుకున్నారు. తన ఆకలిని, తన అవసరాలను షాలిని అర్థం చేసుకుందని భావోద్వేగానికి గురయ్యారు. తమ మధ్య ఉన్న అనుబంధం కేవలం పైకి కనిపించే విషయాలకు మాత్రమే పరిమితం కాదని ఆయన మాటలను బట్టి స్పష్టమైంది.అయితే, తమ బంధం గురించి త్రిగుణ్ అంత దిగజారి మాట్లాడటాన్ని తట్టుకోలేకపోయానని రోహిత్ అన్నారు.
బ్యాడ్జిని చూపిస్తూ రోహిత్ హెచ్చరిక
తనకు ఇచ్చిన బ్యాడ్జిని చూపిస్తూ రోహిత్ త్రిగుణ్‌కు గట్టిగా హెచ్చరిక చేశారు. ఆ బ్యాడ్జి తనను కట్టడి చేస్తోందని, అది లేకపోతే ఇంత ప్రశాంతంగా సమాధానం ఇచ్చేవాడిని కాదని వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
Harish Rao | గ్రావిటీతో నీళ్లా.. నిరూపిస్తే రాజీనామా? లేదంటే మీరు చేస్తారా ?.. సర్కార్‌కు హరీశ్ ఓపెన్ చాలెంజ్
KTR | కరువు తెచ్చి.. వరి వద్దంటరా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

