Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 54వ రోజు ఎపిసోడ్లో కెప్టెన్సీ కోసం నిర్వహించిన ‘అల్టిమేట్ గోట్’ టాస్క్ హౌస్‌లో వేడిని పెంచింది. ఒకవైపు కంటెస్టెంట్లు కెప్టెన్సీ కోసం పోటీపడుతుంటే.. మరోవైపు వారి మధ్య మాటల యుద్ధాలు, గొడవలు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించాయి.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 54వ రోజు ఎపిసోడ్లో కెప్టెన్సీ కోసం నిర్వహించిన ‘అల్టిమేట్ గోట్’ టాస్క్ హౌస్‌లో వేడిని పెంచింది. ఒకవైపు కంటెస్టెంట్లు కెప్టెన్సీ కోసం పోటీపడుతుంటే.. మరోవైపు వారి మధ్య మాటల యుద్ధాలు, గొడవలు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించాయి. చివరకు ఈ టాస్క్‌లో త్రిగుణ్ విజయం సాధించి కెప్టెన్‌గా నిలిచాడు. గ్రీన్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లకు కెప్టెన్సీ సాధించే అవకాశం కల్పిస్తూ బిగ్‌బాస్ ప్రత్యేక టాస్క్ నిర్వహించాడు. త్రిగుణ్, ముఖేష్, రామ్ ప్రసాద్, దేబ్జానీ, నీతూ నటరాజ్, వర్షిణి ఈ పోటీలో పాల్గొన్నారు. టాస్క్‌లో భాగంగా హర్డిల్స్ దాటుకుంటూ బాల్స్‌ను సపోర్టర్లకు అందించాలి. ఆ తర్వాత ప్రత్యేక బోర్డుపై సరైన స్థానంలో బాల్ పడేలా చేయాలి. బాల్ పడిన ఆప్షన్ ఆధారంగా పోటీదారులు ముందుకు లేదా వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ పోటీలో త్రిగుణ్ వేగంగా బాల్స్‌ను తీసుకెళ్లి తనకు ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేశాడు. ముఖేష్ కూడా గట్టిగానే ప్రయత్నించినప్పటికీ, అతడి బాల్స్ ఆశించిన స్థాయిలో పడలేదు. దీంతో త్రిగుణ్ విజేతగా నిలిచి ‘గోట్’ సాధించాడు. అతడిని ఈ వారం కెప్టెన్‌గా ప్రకటించిన బిగ్‌బాస్ మరో ప్రత్యేక అవకాశం కూడా ఇచ్చాడు. హౌస్‌లో ఉన్నన్ని వారాలు కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచే అవకాశం కల్పించాడు. టాస్క్ జరుగుతున్న సమయంలో ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. టాస్క్‌లో తనకు సరైన సహకారం అందలేదని ముఖేష్ అసహనం వ్యక్తం చేశాడు. వంశీని నమ్మి మరోసారి అవకాశం ఇచ్చానని వ్యాఖ్యానించాడు. దీనికి వంశీ కూడా ఘాటుగా సమాధానం ఇచ్చాడు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా ముఖేష్ వ్యవహరిస్తున్నాడంటూ విమర్శించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
ముఖేష్ ప్రవర్తనపై శివ్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. ‘ఏంటి అలా చూపిస్తున్నావ్.. కొడతావా?’ అంటూ ప్రశ్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. టాస్క్‌లో సహకరించాల్సిన సపోర్టర్ల నిర్ణయాలు పోటీదారుల మధ్య గొడవలకు కారణమయ్యాయి. మరోవైపు రోహిత్, అమన్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. అమన్‌ను ఉద్దేశించి రోహిత్ ‘కన్నింగ్’ అంటూ వ్యాఖ్యానించడంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇద్దరి మధ్య మాటలు తీవ్ర స్థాయికి చేరడంతో హౌస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇక ఇదే ఎపిసోడ్లో సడెన్ ఎలిమినేషన్ అంశం కూడా ఆసక్తికరంగా మారింది. రెడ్ జోన్లో ఉన్నవారిలో కంటెస్టెంట్ల ఓట్ల ఆధారంగా ఒకరిని ఎలిమినేట్ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియలో రామకృష్ణకు ఎక్కువ ఓట్లు పడగా, ప్రేక్షకుల ఓటింగ్‌లో సుధీర్‌కు తక్కువ ఓట్లు వచ్చినట్లు వెల్లడించారు. దీంతో సుధీర్ ఎలిమినేషన్ అంచుకు చేరుకున్నాడు. అయితే ముఖేష్ తన పవర్‌ను ఉపయోగించి సింగర్ ఝాన్సీకి తన వద్ద ఉన్న ప్రత్యేక అవకాశాన్ని మరోసారి వినియోగించుకునే అవకాశం కల్పించాడు. ఝాన్సీ ఆ అవకాశాన్ని ఉపయోగించడంతో సుధీర్ ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాడు.
ప్రస్తుతం ఈ వారం నామినేషన్లలో రోహిత్, వంశీ, సుధీర్, రామకృష్ణ, శివ, వర్షిణి, సింగర్ ఝాన్సీ ఉన్నారు. వీరిలో ఎవరు హౌస్‌ను వీడతారన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు త్రిగుణ్‌కు లభించిన ప్రత్యేక కెప్టెన్సీ అవకాశం, ముఖేష్-వంశీ గొడవ, రోహిత్-అమన్ మధ్య వివాదం రాబోయే ఎపిసోడ్లపై ఆసక్తిని పెంచుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
Exams | విద్యార్థులకు సమ్మర్ టెన్షన్.. పరీక్షల సమయంలో కరెంట్, నీటి కష్టాలు తప్పవా?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

