Bigg Boss 10 | వర్షిణికి త్రిగుణ్ షాక్.. 8వ వారం నామినేషన్స్‌లో ఏకంగా 8 మంది!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా సాగుతోంది. సోమవారం ప్రారంభమైన నామినేషన్ల పర్వం మంగళవారం ఎపిసోడ్‌లోనూ కొనసాగింది. ఈ క్రమంలో వర్షిణి, త్రిగుణ్ మధ్య స్నేహానికి సంబంధించిన వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఆరేళ్ల స్నేహం ఉన్నప్పటికీ తనను నామినేట్ చేయడంతో వర్షిణి భావోద్వేగానికి గురైంది.
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా సాగుతోంది. సోమవారం ప్రారంభమైన నామినేషన్ల పర్వం మంగళవారం ఎపిసోడ్‌లోనూ కొనసాగింది. ఈ క్రమంలో వర్షిణి, త్రిగుణ్ మధ్య స్నేహానికి సంబంధించిన వివాదం హాట్ టాపిక్‌గా మారింది. ఆరేళ్ల స్నేహం ఉన్నప్పటికీ తనను నామినేట్ చేయడంతో వర్షిణి భావోద్వేగానికి గురైంది. మరోవైపు, ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నామినేషన్ల ప్రక్రియను మరింత ఆసక్తికరంగా మార్చారు. సోమవారం ఎపిసోడ్లో త్రిగుణ్.. వర్షిణిని నామినేట్ చేయడంతో ఆమె తీవ్రంగా బాధపడింది. ఆరేళ్లుగా స్నేహితులుగా ఉన్న తమ మధ్య ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. బయట కనిపించిన త్రిగుణ్‌కు, బిగ్‌బాస్ ఇంట్లో ఉన్న త్రిగుణ్‌కు చాలా తేడా ఉందని కామెంట్ చేసింది.
తన స్నేహితుల కోసం త్రిగుణ్ ఎలా నిలబడతాడో తనకు తెలుసని, కానీ ఇప్పుడు ఆయన వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని చెప్పింది. దీనికి త్రిగుణ్ స్పందిస్తూ.. తాను ఆట కోసమే నామినేషన్ చేశానని స్పష్టం చేశాడు. స్నేహం కోసం ఒక సందర్భంలో నిలబడలేకపోయి ఉండొచ్చని, స్నేహితుడిగా విఫలమయ్యానేమో కానీ ఆటలో మాత్రం గెలిచానని అన్నాడు. తాను స్నేహం కోసం కాకుండా తన కుటుంబం కోసం బిగ్‌బాస్ ఇంటికి వచ్చానని, కుటుంబమే తనకు మొదటి ప్రాధాన్యమని ఇతర సభ్యులకు వివరించాడు. దీంతో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇంట్లో చర్చనీయాంశంగా మారింది. ఇక నామినేషన్ల ప్రక్రియలో నరేష్.. వర్షిణి, ఝాన్సీలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఝాన్సీ విషయంలో అతడు చెప్పిన కారణం బలంగా లేదని నామినేషన్‌ను పరిశీలించే సభ్యులు అభిప్రాయపడ్డారు.. అయితే వర్షిణి విషయంలో మాత్రం నరేష్ తన వాదనను గట్టిగా వినిపించాడు.
ఆమె ఆటలో పూర్తి స్థాయిలో పాల్గొనడం లేదని, మధ్యలోనే వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించాడు. తనను నమ్మినవారికి కూడా ఇది నిరాశ కలిగిస్తుందని వ్యాఖ్యానించాడు. దీంతో వర్షిణి నామినేషన్ ఆమోదం పొందింది. శివకుమార్.. సుధీర్ రెడ్డి, వంశీలను నామినేట్ చేశాడు. సుధీర్ తన వాదనలను బలంగా వినిపించడం లేదని, కెప్టెన్‌గా సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించాడు. సుధీర్‌ను ‘బ్లాక్ ఫుట్’ అంటూ విమర్శించడంతో పాటు, అతడి కెప్టెన్సీపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సేఫ్ గేమ్ ఆడుతున్నాడని వ్యాఖ్యానించాడు. ఈ నామినేషన్ ఆమోదం పొందింది. మరోవైపు, రామ్ ప్రసాద్.. శివకుమార్‌ను నామినేట్ చేశాడు. మొదట్లో సొంతంగా ఆట ఆడతానని చెప్పి, ఆ తర్వాత అందరితో కలిసి ఆడతానని మాట మార్చాడని ఆరోపించాడు. దీంతో ఇంటి సభ్యుల మధ్య వాదనలు మరింత పెరిగాయి.
నామినేషన్లలో భాగంగా శ్వేత.. దేబ్జానీని నామినేట్ చేసింది. ఆమె తరచూ ఏడుస్తోందని కారణం చెప్పింది. రోహిత్.. నరేష్‌ను నామినేట్ చేస్తూ, తాను వంద శాతం ఆట ఆడలేనని చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. రామకృష్ణ.. వర్షిణిని నామినేట్ చేస్తూ, ఆట కంటే వ్యక్తిత్వమే ముఖ్యమని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించాడు. ఇక సింగర్ ఝాన్సీ.. శివకుమార్‌ను నామినేట్ చేసింది. మొదటి టాస్క్‌లో ఓడిపోయిన తర్వాత గెలిచి చూపిస్తానని చెప్పినా, ఆ స్థాయిలో ఆటను ప్రదర్శించలేదని ఆరోపించింది. మరోవైపు స్వేత.. ఝాన్సీని నామినేట్ చేసింది. రెడ్ జోన్లో ఉన్న వంశీ, నరేష్, శ్వేతల్లో నామినేషన్‌కు వంశీ ఎంపికయ్యారు.
ఎనిమిదో వారం నామినేషన్ల జాబితాలో సింగర్ ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్ రెడ్డి, రామ్ ప్రసాద్, వర్షిణి, శివకుమార్, వంశీ ఉన్నారు. ఈ వారం నామినేషన్లలో స్నేహాలు, వ్యక్తిగత అభిప్రాయాలు, ఆటతీరుపై విమర్శలు ప్రధానంగా కనిపించాయి. ముఖ్యంగా వర్షిణి, త్రిగుణ్ మధ్య జరిగిన పరిణామాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు ఈ ఎనిమిది మందిలో ఎవరు ప్రేక్షకుల మద్దతు పొందుతారు? ఎవరు ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటారు? అన్నది రాబోయే ఎపిసోడ్లలో తేలనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి త్రిగుణ్ షాక్.. 8వ వారం నామినేషన్స్‌లో ఏకంగా 8 మంది!
Inter Board | ఇంటర్ బోర్డుపై జూనియర్ కాలేజీలు ఫైర్.. నవంబర్ 1లోగా నిర్ణయం తీసుకోకపోతే ముట్టడిస్తామని వార్నింగ్!
Vote for Note | ‘ఓటుకు నోటు’ కేసు.. విచారణ దీపావళి తర్వాతే వాయిదా వేసిన సుప్రీంకోర్టు
Yasangi Paddy Cultivation | యాసంగికి నీళ్లు, కరెంట్ ఇవ్వం.. సాగు చేయొద్దంటున్న మంత్రులు పొంగులేటి, తుమ్మల
RTC Elections | ఆర్టీసీ కార్మికలోకం కుతకుత.. గుర్తిపు సంఘం ఎన్నికల ఫలితాల తారుమారుపై కన్నెర్ర
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

