టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో పోషించిన చిత్రం భీమ్లానాయక్ (Bheemla Nayak). సాగర్ కే చంద్ర (Sagar K Chandra) దర్శకత్వం వహించాడు. విడుదలైన అన్ని సెంటర్లలోస్క్సెస్ ఫుల్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ అభిమానుల కోసం అదిరిపోయే సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. భీమ్లా నాయక్ రాప్ సాంగ్‌ను లాంఛ్ చేసింది థమన్ అండ్ టీం.
భీమ్లా..లా లా లా నాయక్..వచ్చాడు భీమ్లా..గ్రనేడ్ బాంబులా..కల్లోలం చేస్తాడు చూసుకో సాలా..లాఠితో చాలా ఉంటాది దూల..షురూ చేసిండంటే కాళ్లు మొక్కాలా..బట్టలే అదరగొట్టే మిర్చీ మసాలా..బెల్టులే తీసిండంటే మూతి పగలాలా..గళ గళ గళ గళ నోటంకీ సాలా..తోలంతా లేచిందో భీమ్లా…అంటూ సాగే భీమ్లా నాయక్ రాపో సాంగ్ ఊరమాస్‌గా సాగుతూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
మరోవైపు ఇటీవలే భీమ్లా నాయక్ హిందీ ట్రైలర్ (Bheemla Nayak Hindi trailer) ను కూడా మేకర్స్ విడుదల చేయగా..అద్బుతమైన స్పందన వస్తోంది. హిందీ వెర్షన్ కూడా మంచి కలెక్షన్లు రాబడుతుందని ధీమాగా ఉన్నారు మేకర్స్. మలయాళ సూపర్ హిట్ రీమేక్ అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ గా తెరకెక్కిన భీమ్లానాయక్ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు.