Bachchhan Paandey | ఒంటి కన్నుతో అక్షయ్‌కుమార్.. ఆకట్టుకుంటున్న ‘బచ్చన్ పాండే’ ట్రైలర్
Bachanpande trailer | బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'బచ్చన్ పాండే'. 'హౌస్‌ఫుల్4' ఫేం ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైనమెంట్ పతాకంపై సజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నాడు.
Bachchhan Paandey trailer | బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చన్ పాండే’. ‘హౌస్‌ఫుల్4’ ఫేం ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని నడియాద్వాలా గ్రాండ్సన్ ఎంటర్టైనమెంట్ పతాకంపై సజిద్ నడియాద్వాలా నిర్మించాడు. కృతీసనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటించారు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘జిగర్తాండ’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని మార్చి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదలచేశారు.
ఈ ట్రైలర్లో అక్షయ్‌కుమార్ ఒంటి కన్నుతో క్రూరంగా కనిపిస్తున్నాడు.ఇందులో కృతిసనన్ జిగర్తాండ చిత్రంలో సిద్దార్థ్ పోషించిన పాత్రలో నటించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.ఇక అక్షయ్‌కుమార్‌కు జోడిగా జాక్వెలిన్ నటించింది. ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు కామెడీ పుష్కలంగా ఉన్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. జిగర్తాండ చిత్రాన్ని తెలుగులో గద్దలకొండ గణేష్‌గా వరుణ్‌తేజ్ రీమేక్ చేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అథర్వమురళి, మృనాళిని రవి కీలకపాత్రల్లో నటించారు. వరుణ్‌తేజ్‌కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

