తన డ్రీమ్ ప్రాజెక్ట్‌తో కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనున్న బాలయ్య

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వారసుల హవా నడుస్తుంది. మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి లాంటి బడా ఫ్యామిలీస్ నుంచి ఎందరో నటీనటులు కెమెరా ముందుకొచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలో బాలయ్య వారసుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అనే ఆసక్తి అభిమానులలో ఎప్పటి నుండో ఉంది. గత కొన్నేళ్లుగా దీనిపై సస్పెన్స్ నెలకొని ఉండగా, బాలకృష్ణ తన బర్త్ డే రోజు కుమారుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు.
ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య ..గతంలో నేను నటించిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ చేయనున్నాను. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ ఉంటుంది. ఇందులో ఇద్దరం కలిసి నటిస్తాము. అవకాశం ఉంటే ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహిస్తాను అని బాలయ్య స్పష్టం చేశారు. తన తండ్రి ఎన్టీఆర్.. తాతమ్మకల అనే సినిమాలో మొదట తనకు అవకాశం ఇచ్చి ఎలా మెళుకువలు నేర్పించారో తాను కూడా తన కొడుకుకు ఫస్ట్ మూవీ కోసం అన్ని మెళుకువలు నేర్పిస్తానని బాలకృష్ణ తెలిపారు. బాలయ్య నోటి నుండి ఆయన తనయుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

