Emergency look | జేపీ రోల్లో అనుపమ్ ఖేర్..ఎమర్జెన్సీ లుక్ అవుట్
రీసెంట్గా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది ఎమర్జెన్సీ (Emergency). ఈ చిత్రంలో దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ కీ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే కంగనా లుక్ కూడా విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది.
బాలీవుడ్ (Bollywood) క్వీన్ కంగనారనౌత్ (Kangana Ranaut) నటిస్తోన్న తాజా చిత్రం ఎమర్జెన్సీ (Emergency). రీసెంట్గా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ఇప్పటికే కంగనా లుక్ కూడా విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో దర్శకనిర్మాత అనుపమ్ ఖేర్ కీ రోల్ పోషిస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రముఖ రాజకీయ వేత్త జయప్రకాశ్ నారాయణ్ (జేపీ)పాత్రలో నటిస్తున్నారు.
కాగా మేకర్స్ ఆయన పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. అనుపమ్ ఖేర్ (Anupam Kher) ఇంటెన్స్ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ మూవీలో శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోం బ్యానర్ మణి కర్ణిక ఫిలిమ్స్ బ్యానర్‌పై రేణు పిట్టి, కంగనారనౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రానికి టెస్టుయో నగట సినిమాటోగ్రాఫర్ కాగా..జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్.
కంగనా నెక్ట్స్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ రోల్ ఆధారంగా తెరకెక్కుతున్న తేజాస్ చిత్రంలో నటిస్తోంది. సర్వేశ్ మేవారా దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతోపాటు టికు వెడ్స్ షేరు చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తోంది.
The Man who led a revolution!
Presenting @AnupamPKher as the people’s hero, Lok Nayak JayaPrakash Narayan. #Emergency #KanganaRanaut @nishantpitti @shreyastalpade1 @MrSheetalsharma #AkshtRanaut @writish @gvprakash @manojmuntashir #SamirKhurana #RakeshYadav #AjayRai pic.twitter.com/iDgSSgZ6ws
— Manikarnika Films Production (@ManikarnikaFP) July 22, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

