Anne Hathaway | ఆర్ఆర్ఆర్పై హాలీవుడ్ నటి ప్రశంసల జల్లు
Anne Hathaway | గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రాల్లో టాప్‌లో ఉంటుంది ఆర్ఆర్ఆర్ (RRR). నేటికి ఎవరో ఒక సెలబ్రిటీ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నారంటే సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Anne Hathaway | గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రాల్లో టాప్‌లో ఉంటుంది ఆర్ఆర్ఆర్ (RRR). ఈ మూవీ అనౌన్స్మెంట్ నుంచి విడుదలయ్యే వరకు ఏదో రకంగా వార్తల్లో నిలిచింది. ఇక విడుదల తర్వాత కూడా నేటికి ఎవరో ఒక సెలబ్రిటీ ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతున్నారంటే సినిమా క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాపై ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా చాలా మంది సెలబ్రిటీలతోపాటు రాజకీయ వేత్తలు ప్రశంసల వర్షం కురిపించారు.
తాజాగా ఈ జాబితాలో పాపులర్ హాలీవుడ్ నటి కూడా చేరిపోయింది. ఆస్కార్ విన్నింగ్ నటి అన్నే హత్వే (Anne Hathaway) ప్రశంసలు కురిపించింది. ది ఐడియా ఆఫ్ యూ ప్రీమియర్ షోలో ఈ భామ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ అందరిలాగే నాకు కూడా నచ్చింది. ఈ మూవీ చాలా అద్భుతం. ఆర్ఆర్ఆర్ టీంతో కలిసి పనిచేయడం ఒక కల అని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను గ్లోబల్ స్టార్లను చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అత్యున్నత ఆస్కార్ (Oscar 2023) పురస్కారం అందుకుందని తెలిసిందే. ఎపిక్ డ్రామా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. జూనియర్ ఎన్టీఆర్ కొమ్రంభీంగా నటించాడు. అలియాభట్, అజయ్ దేవ్గన్, శ్రియాశరణ్, ఒలివియా మొర్రీస్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajiv Yuva Vikasam | కొందరికే యువవికాసం.. యువతకు మరోసారి కాంగ్రెస్ దగా!
Uttam Kumar Reddy | పెత్తనం లేని ఉత్తమ్..! ఉత్సవ విగ్రహంగా మిగిలిన సీనియర్ మంత్రి
YTPC | అంధకారంలో ఆశాదీపం..! కేసీఆర్ కలల ప్రాజెక్టు వైటీపీఎస్ ఐదో యూనిట్ సింక్రనైజేషన్ పూర్తి
Hardeep Puri | ఎప్స్టీన్తో హర్దీప్ రహస్య సమావేశం..! ఫొటోలు బయటకు రావడంతో రాజకీయ దుమారం
Liquor Sales | నీళ్లు నిల్.. మద్యం ఫుల్..! దసరాకు పల్లెల్లో పారిన మద్యపుటేరులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

