సందీప్‌రెడ్డి సార్ మెచ్చుకున్నారు
‘ఇందులో నేను సరదాగా ఉండే తమిళమ్మాయిని. బబ్లీగా కనిపిస్తా. ఇలాంటి పాత్రలో నటించాలనేది నా డ్రీమ్. ‘8 వసంతాలు’ తర్వాత చాలా కథలు విన్నాను. అవేవీ నన్ను ఆకట్టుకోలేదు. ఆ టైమ్‌లో ‘రోమాంచకం’ కథ విన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను కోరుకున్న పాత్ర ఇది’ అంటూ అనంతిక సనిల్ కుమార్ ఆనందం వెలిబుచ్చారు. అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో సుమంత్ప్రభాస్కి జోడీగా ఆమె నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’.
‘ఇందులో నేను సరదాగా ఉండే తమిళమ్మాయిని. బబ్లీగా కనిపిస్తా. ఇలాంటి పాత్రలో నటించాలనేది నా డ్రీమ్. ‘8 వసంతాలు’ తర్వాత చాలా కథలు విన్నాను. అవేవీ నన్ను ఆకట్టుకోలేదు. ఆ టైమ్‌లో ‘రోమాంచకం’ కథ విన్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను కోరుకున్న పాత్ర ఇది’ అంటూ అనంతిక సనిల్ కుమార్ ఆనందం వెలిబుచ్చారు. అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో సుమంత్ప్రభాస్కి జోడీగా ఆమె నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘రోమాంచకం’. వేణుగోపాల్‌రెడ్డి దర్శకుడు. ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. ఈ నెల 3న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు అనంతిక. ‘యూత్‌కి బాగా రిలేట్ అయ్యే సినిమా ఇది.
ఇందులో ప్రేమ మాత్రమే కాదు, వినోదం, ఉత్కంఠ కూడా ఉంటాయి. వీటిలో ఉత్కంఠ నాకు బాగా నచ్చింది. అది కూడా ప్రేమతో కూడిన ఉత్కంఠ అనమాట. యువత జీవితాల్లో జరుగుతున్న కాంటెంపరరీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. యూత్ మాత్రమే కాదు, కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడొచ్చు. సుమంత్ పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నా పాత్ర ఆయనతో పోటీపడేలా ఉంటుంది. మా మధ్య వచ్చే సన్నివేశాలు నేచురల్‌గా అనిపిస్తాయి. మ్యూజికల్ డ్రామాలంటే నాకిష్టం. ఈసినిమా కూడా మ్యూజికల్‌గా బావుంటుంది. దర్శకుడు క్లారిటీతో సినిమా తీశారు’ అని చెప్పారు అనంతిక. ఇంకా చెబుతూ ‘కొన్ని సీన్స్ నటించేటప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అలాంటి సీన్స్ ఇందులో చాలా ఉన్నాయి. ‘8 వసంతాలు’ నాయికగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో నాతోపాటు హీరోకి కూడా మంచి పేరొస్తుంది. సినిమా చూసి సందీప్సార్ నా నటనను మెచ్చుకున్నారు. ఇక ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు అనంతిక సనిల్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

