ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నది. వినోదరంగంలో కృత్రిమ మేధ వినియోగం బాగా పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో తొలి తెలుగు ఏఐ ఫిల్మ్‌గా ‘అంబ’s రివెంజ్’ ప్రేక్షకుల ముందుకురానుంది. మహాభారతంలోని శక్తివంతమైన అంబ పాత్రను ఆధారంగా చేసుకొని ఈ పౌరాణిక కథాంశాన్ని తెరకెక్కించామని మేకర్స్ తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక ఏఐ టూల్స్ వినియోగించామని, విజువల్స్‌తో పాటు పాత్రల రూపకల్పన, స్క్రీన్‌ప్లే అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చిత్ర క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి తెలిపారు. పౌరాణిక కథను ఆధునిక సాంకేతిక హంగులతో ప్రయోగాత్మకంగా తెరకెక్కించామని నిర్మాత శ్రీకాంత్ రెడ్డి కుందూరు పేర్కొన్నారు.