ఆ రూమర్లకు చెక్
అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తారని, ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నదంటూ వార్తలు గతంలో బలంగా వినిపించాయి. అయితే.. గత కొన్ని రోజలుగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్చల్ చేస్తున్నది. ఈ సినిమాకోసం లోకేష్ చెప్పిన ఫైనల్ డ్రాప్ట్ అల్లు అర్జున్‌కి నచ్చలేదని, అందుకే సినిమాను పక్కన పెట్టారంటూ ప్రచారం ఊపందుకుంది.
ఈ ప్రచారం వల్ల బన్నీ అభిమానుల్లో నిరాశ అలముకున్నది. అయితే.. యూనిట్ నుంచి మాత్రం ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. ఎట్టకేలకు ఈ రూమర్లపై బన్నీ పీఆర్ టీమ్ స్పందిస్తూ ఓ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ రద్దవ్వలేదనీ, అట్లీ సినిమా పూర్తయ్యాక లోకేష్ కనకరాజ్ సినిమా పట్టాలెక్కుతుందని వారు పేర్కొన్నారు. దీంతో బన్నీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. బన్నీ, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రూపొందనున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

