గౌరవాన్ని తీసుకువచ్చిన విజయమిది

‘డ్యాన్స్, ఫైట్స్‌కు పరిమితం కాకుండా నటనకు ఆస్కారమున్న మంచి పాత్ర చేయాలనే ఆలోచనతో అఖిల్ ఈ సినిమాలో నటించాడు. ఈ ఛాయిస్ అతడికి గౌరవాన్ని తీసుకువస్తున్నది. అఖిల్ కెరీర్లో మరచిపోలేని విజయమిది’ అని అన్నారు అల్లు అర్జున్. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్ర విజయోత్సవ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించారు. బన్నీవాస్, వాసువర్మ నిర్మించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘అఖిల్‌ను నా సోదరుడిగా భావిస్తాను. అతడికి పెద్ద విజయం దక్కడం ఆనందంగా ఉంది. ‘లవ్‌స్టోరీ’తో ఇటీవల నాగచైతన్య హిట్ కొట్టాడు. ఆ విజయపరంపరను సోదరుడు అఖిల్ కొనసాగించాడు. పూజాహెగ్డే కెరీర్లో అత్యుత్తమ నటనను కనబరిచిన చిత్రమిది.
ప్రతి హీరోకు పూజాహెగ్డే లక్కీస్టార్‌గా మారిపోతున్నది’ అని అన్నారు. పెళ్లి చేసుకోవాలనుకునే వారందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని అల్లు అరవింద్ పేర్కొన్నారు. అఖిల్ మాట్లాడుతూ ‘సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో కాకుండా వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టాలనుకునే వారికి ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాల్ని సూచిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. మేము చెప్పిన పాయింట్‌తో ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ధైర్యంతో మంచి కథల్ని ఎంచుకుంటూ ముందడుగువేస్తా. తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన పెద్ద బహుమతి ఇది’ అని చెప్పారు.కమర్షియల్ హంగుల కోసం తాపత్రయపడకుండా కథను నమ్ముకొని నిజాయితీగా సినిమా చేశామని బన్నీవాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో వంశీపైడిపల్లి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

