వేసవిలో వినోదాల జల్లు
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. మల్లి అంకం దర్శకుడు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది.
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. మల్లి అంకం దర్శకుడు. చిలకా ప్రొడక్షన్స్ పతాకంపై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ర్టాల థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సొంతం చేసుకుంది. రెండు రాష్ర్టాల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.
‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. జ్యోతిష్యం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. తాను వలచిన అమ్మాయిని పెళ్లి చేసుకునే క్రమంలో ఓ యువకుడికి ఎదురైన సంఘటనలేమిటన్నదే సినిమా కథాంశం’ అని చిత్ర బృందం పేర్కొంది. వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, ఆరియానా గ్లోరీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సూర్య, సంగీతం: గోపీసుందర్, సహ నిర్మాత: భరత్ లక్ష్మీపతి, దర్శకుడు: మల్లి అంకం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

