Alia Bhatt | సూపర్ ఏజెంట్లుగా బాలీవుడ్ భామలు అలియా భట్, శార్వరీ వాఘ్
బాలీవుడ్ భామలు అలియా భట్, శార్వరీ వాఘ్ త్వరలో ఓ సినిమాలో కలిసి నటించనున్నారు. ఓ సీనియర్ తార వర్ధమాన నటితో కలిసి తెర పంచుకోనుండడం ఈ సినిమా ఎలా ఉంటుందోననే విషయమై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది.
Alia Bhatt | బాలీవుడ్ భామలు అలియా భట్, శార్వరీ వాఘ్ త్వరలో ఓ సినిమాలో కలిసి నటించనున్నారు. ఓ సీనియర్ తార వర్ధమాన నటితో కలిసి తెర పంచుకోనుండడం ఈ సినిమా ఎలా ఉంటుందోననే విషయమై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది. మహిళా ప్రధాన నేపథ్యమున్న ఈ ప్రాజెక్ట్‌ను యష్‌రాజ్ ఫిలిమ్స్ (వైఆర్ఎఫ్) సంస్థ నిర్మిస్తున్నది. ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్‌తో డైరెక్టర్‌గా అరగేట్రం చేసిన శివ్ రావైల్ దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాదే ప్రొడక్షన్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో ముద్దుగుమ్మలిద్దరూ సూపర్ ఏజెంట్లుగా కనిపించనున్నారు.
చేపట్టిన ప్రాజెక్టులను తనదైన పనితీరుతో రూపొందించడం ద్వారా ఈతరం నాడి తెలిసిన డైరెక్టర్‌గా సినీజనాలు చెప్పుకొంటున్న శివ్ రావైల్ మహిళా నేతృత్వంలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ను సైతం అద్భుతంగా మలుస్తాడని చర్చ నడుస్తున్నది. సీనియర్ నటి అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, యువ నటి శార్వరీ వాఘ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం. ఆదిత్య చోప్రాకు చెందిన అనేక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శివ్ రావైల్ ఇటీవల ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- alia bhatt
- Sharvari
- Shiv Rawail
- YRF
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

