యాక్షన్ మోడ్‌లోకి అక్షయ్
గత కొన్నేళ్లుగా వినోదప్రధానమైన చిత్రాలు, భావోద్వేగ కథలతో ఆడియన్స్‌ని అలరిస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ త్వరలో యాక్షన్ మోడ్‌లోకి రానున్నారు.
గత కొన్నేళ్లుగా వినోదప్రధానమైన చిత్రాలు, భావోద్వేగ కథలతో ఆడియన్స్‌ని అలరిస్తున్న బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్ త్వరలో యాక్షన్ మోడ్‌లోకి రానున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలో ఆయన నటించి చాలా ఏళ్లయింది. ఆ లోటును భర్తీ చేస్తూ అక్షయ్ చేస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘సముక్’. కనిష్క్ వర్మ దర్శకుడు. విపుల్ అమృత్లాల్ షా నిర్మాత.
భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ ‘అక్షయ్ పూర్తిస్థాయి యాక్షన్ మోడ్‌లోకి తిరిగి వస్తున్నారు. ఇది ఓ ఏలియన్ సర్వైవల్ థ్రిల్లర్. హారర్ అంశాలతోపాటు, మిలిటరీ రియలిజం కూడా ఇందులో ఉంటాయి. అంతర్జాతీయ సాంకేతిక బృందం ఈ సినిమాకోసం పనిచేయబోతున్నది. ‘సముక్’ భారతీయ సినీ చరిత్రలో ఇంతకు ముందు రాని ప్రయత్నం’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

