కాస్త ఆలస్యంగా రానున్న ‘లెనిన్’
అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న రూరల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్' చిత్రాన్ని మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ భావించారు.
అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న రూరల్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’ చిత్రాన్ని మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్మాతలు అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ భావించారు. అయితే.. ఏప్రిల్ 30న రామ్చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదల కానుండటంతో ‘లెనిన్’ విడుదలను జూన్ 26కు మేకర్స్ వాయిదా వేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరు చిత్రాల నిర్మాతలు పరస్పరం గౌరవించుకుంటూ, థియేటర్ల లభ్యతను కూడా దృష్టిలో పెట్టుకుని ‘లెనిన్’ చిత్రం విడుదలను జూన్ 26కు వాయిదా వేసినట్టు ప్రకటనలో నిర్మాతలు పేర్కొన్నారు. రామ్చరణ్, అఖిల్ అక్కినేని మధ్య ఉన్న ఆత్మీయబంధం కూడా ఈ నిర్ణయానికి కారణమని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు. మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ చిత్రానికి కెమెరా: లియోన్ బ్రిట్టో, సంగీతం: థమన్.ఎస్, సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్, నిర్మాణం: మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

