సుశాంత్ మిస్టరీ థ్రిల్లర్
సుశాంత్ కథానాయకుడిగా ఓ మిస్టరీ థ్రిల్లర్ రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా ఆయన కెరీర్లో 10వ సినిమా కావడం విశేషం. పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో వరుణ్‌కుమార్, రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సుశాంత్ కథానాయకుడిగా ఓ మిస్టరీ థ్రిల్లర్ రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమా ఆయన కెరీర్లో 10వ సినిమా కావడం విశేషం. పృథ్వీరాజ్ చిట్టేటి దర్శకత్వంలో వరుణ్‌కుమార్, రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ని మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో రెండు డిఫరెంట్ లుక్స్‌తో ైస్టెలిష్‌గా సుశాంత్ కనిపిస్తున్నారు. పోస్టర్ డిజైన్ చేసిన తీరును బట్టి ఇది మిస్టరీ థ్రిల్లర్ మూవీ అని తెలుస్తున్నది. భీతిగొలిపే కారుచీకటి, గుడ్లగూబలు, రాబందులు.. పుర్రెలు, వీటిమధ్య సీరియస్‌గా చూస్తూ సుశాంత్.. ఆయన్నే చూస్తూ ఓ నల్ల పిల్లి.. ఇవన్నీ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే: అనిరుధ్ కృష్ణమూర్తి, కెమెరా: వైవిబీ శివసాగర్, నిర్మాణం: సంజీవని క్రియేషన్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

