attack | కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియాపై దుండగుడి దాడి
actress chourasiya |

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ నటిపై దుండగుడు దాడికి (attak) పాల్పడ్డాడు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ రోడ్ నంబర్ 9 వద్ద నటి చౌరాసియాపై (Chourasiya) గుర్తుతెలియని వ్యక్తి దాడిచేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చౌరాసియాకు గాయాలయ్యాయి. కాగా, దుండగుడు ఆమె సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు.

ఆమె డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఆమెను సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో వాకింగ్ వెళ్లగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
BRS | రిమాండ్ రిజెక్ట్స్..! బలంగా వాదనలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ టీమ్
పండుగ పూట..జర పైలం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

