90’s Teaser | శివాజీ ఓటీటీ ఎంట్రీ.. ఎంటర్టైనింగ్గా 90’s టీజర్
90’s Teaser | టాలెంటెడ్ యాక్టర్ శివాజీ (Shivaji) చాలా కాలం తర్వాత 90’s వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. Middle Class Biopic ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ టీజర్‌ను విక్టరీ వెంకటేశ్ లాంఛ్ చేశాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ (శివాజీ) చుట్టూ తిరిగే కథాంశంతో సాగనున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్.
90’s Teaser | తెలుగు ప్రేక్షకులకు ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ శివాజీ (Shivaji). ఈ టాలెంటెడ్ యాక్టర్ చాలా కాలం తర్వాత 90’s వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. Middle Class Biopic ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ టీజర్‌ను విక్టరీ వెంకటేశ్ లాంఛ్ చేశాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ (శివాజీ) చుట్టూ తిరిగే కథాంశంతో సాగనున్నట్టు టీజర్‌తో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. ఇందులో చంద్రశేఖర్ భార్యగా తొలిప్రేమ ఫేం వాసుకి ఆనంద్ నటిస్తోంది.
యూట్యూబర్ మౌలి శివాజీ కొడుకుగా నటిస్తున్నాడు. ఎలాగైనా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని స్కూల్ యాజమాన్యం వల్ల ఒత్తిడికి లోనయ్యే విద్యార్థిగా మౌలి కనిపించబోతున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో జరిగే సరదా సన్నివేశాలతో వినోదాత్మకంగా ఉండబోతున్నట్టు అర్థమవుతోంది. ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వాసంతిక, రోహన్, స్నేహల్ కామత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అమోఘా ఆర్ట్స్, ఎంఎన్‌వో ప్రొడక్షన్స్ బ్యానర్లపైనవీన్ మేడారం, రాజశేఖర్ మేడారం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బలి సంగీతం అందిస్తున్నాడు. ఈ వెబ్ ప్రాజెక్ట్ ETV Win లో జనవరి 5న ప్రీమియర్ కానుంది.
90’s టీజర్..
ఈ మిడిల్ క్లాస్ ఫామిలీ కష్టాలు సంక్రాతి కి పంచనున్నాయ్ నవ్వులు 😂😂
Here’s #90’s – A Middle Class Biopic Teaser launched by Victory @VenkyMama ❤️
Releasing on Jan 05th 2024 on @etvwin 🙌
Written & Directed by @adityahaasan, Produced by… pic.twitter.com/LBQUOL1sSg
— J SOLUTIONS MEDIA®️ (@jsolu_tions) November 1, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
జన గణనపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

