ధిక్కారమే నా నైజం
హీరో రామ్ పోతినేని నటిస్తున్న 23వ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ద్వారా ఆయన తొలిసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
హీరో రామ్ పోతినేని నటిస్తున్న 23వ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమా ద్వారా ఆయన తొలిసారి మెగాఫోన్ పట్టబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశమిది. ‘ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వూల్ఫ్’ అంటూ ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు రామ్ పోతినేని. 20ఏళ్ల సినీ ప్రయాణంలో నటుడిగా, వ్యక్తిగా ఎంతో పరిణతి సాధించానని, ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నా ఏనాడు భయపడలేదని అన్నారు. ‘18ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. జయాపజయాల నుంచి ఎన్నో పాఠాల్ని నేర్చుకున్నా. పరిస్థితులు మనల్ని ఎప్పుడూ భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. కానీ రెబల్‌గా ఉండటమే నా నైజం. నా రూల్స్ ప్రకారం జీవితాన్ని సాగిస్తున్నా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నదే నా ఫిలాసఫీ’ అని చెప్పారు రామ్ పోతినేని. ‘రాపో’ సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

