చేర్యాల, జనవరి 8: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని చిట్యాల గ్రామాన్ని శనివారం సినీ హీరో ప్రియదర్శి, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ వెంపటి చంద్ర, చిట్యాల సర్పంచ్ కుమారుడు, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్ ఎర్రవల్లి సీతారాంతో కూడిన బృందం సందర్శించింది. బృందం సభ్యులు గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు పరిశీలించారు. రైతు వేదిక క్లస్టర్, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బందిని అభినందించారు. గ్రామ సందర్శన గొప్ప అనుభూతిని ఇచ్చిందని, మరోసారి గ్రామాన్ని సందర్శిస్తానని విజిటర్స్ బుక్కులో రాయడంతోపాటు రికార్డులో హీరో ప్రియదర్శి సంతకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రవల్లి రామ్మోహన్రావు, ఎంపీటీసీ మిట్టపల్లి సులోచన శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ పంజాల లత, కార్యదర్శి సిద్ది వీరసోమయ్య తదితరులు ఉన్నారు.