Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Actor Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాట జోరుగా చర్చ సాగుతోంది. తన అభిమాన సంఘం పేరును 'ధనుష్ నర్పణి ఇయక్కం' (ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మార్చడంతో పాటు, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
Actor Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాట జోరుగా చర్చ సాగుతోంది. తన అభిమాన సంఘం పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కం’ (ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మార్చడంతో పాటు, ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో కొద్దిరోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించిన ధనుష్, తాజాగా తన రాజకీయ కార్యాచరణను మరింత వేగవంతం చేసినట్లు సమాచారం.
ఇందులో భాగంగానే చెన్నైలోని చోళింగనల్లూరు జేబీఆర్ కళాశాలలో మహిళా అభిమాన సంఘ ప్రతినిధులతో ధనుష్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న 58 జిల్లాల నుంచి తరలివచ్చిన సుమారు 2,500 మందికి పైగా మహిళా ప్రతినిధులు, అభిమానులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో ముఖాముఖి మాట్లాడటంతో పాటు ఫొటోలు దిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ధనుష్ నిలవాలని ఆయన అభిమానులు తీవ్రంగా ఆకాంక్షిస్తున్నారు.
మరోవైపు, ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ సానుకూలంగా స్పందించింది. ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తాము స్వాగతిస్తామని టీవీకే అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ తెలిపారు. ఇతరులు రాజకీయాల్లోకి రావడానికి తమ పార్టీ ప్రయాణం స్ఫూర్తిగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. అయితే, హీరో విజయ్ సినిమాలను పక్కన పెట్టి పూర్తిస్థాయిలో రాజకీయాల కోసం 30 ఏళ్లుగా శ్రమించారని గుర్తుచేశారు. రాజకీయ పార్టీని స్థాపించడం ఎంత ముఖ్యమో, దానిని నిలబెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించడం కూడా అంతే కష్టమని, ఇందుకోసం పూర్తి సమయం కేటాయించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

