Actor Ajith | నటుడు అజిత్‌కి మరోసారి తప్పిన ప్రమాదం
Racer Ajith | తమిళ స్టార్ హీరో, ప్రముఖ రేసర్ అజిత్ కుమార్‌కు మరోసారి కారు రేసింగ్‌లో పెను ప్రమాదం తప్పింది.
Racer Ajith | తమిళ స్టార్ హీరో, ప్రముఖ రేసర్ అజిత్ కుమార్‌కు మరోసారి కారు రేసింగ్‌లో పెను ప్రమాదం తప్పింది. ఇటలీలోని మిసానోలో జరుగుతున్న GT4 యూరోపియన్ సిరీస్‌లో పాల్గొంటున్న సమయంలో, రేస్ 2లో ఆయన కారు ప్రమాదానికి గురైంది. అజిత్ డ్రైవ్ చేస్తున్న కారు, రేసింగ్ ట్రాక్ మధ్యలో ఆగి ఉన్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో అజిత్ కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాణాపాయం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్ రేసింగ్‌లో అజిత్‌కు ప్రమాదం జరగడం ఇది మూడోసారి. గతంలో కూడా రెండుసార్లు ఆయన రేసింగ్‌లో పాల్గొన్నప్పుడు ఇలాంటి ప్రమాదాల బారిన పడ్డారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

