Bachchhan Paandey | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఈయన చేతిలో అరడజను సినిమాలున్నాయి. ఈయన నటించిన లేటెస్ట్ మూవీ ‘బచ్చన్ పాండే’ విడుదలకు సిద్దంగా ఉంది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘జిగార్తాండ’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఫర్హాజ్ సంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మర్చి18న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం జోరుగా ప్రమోషన్లలో పాల్గొంటుంది.
‘బచ్చన్‌పాండే’ చిత్రంలో అభిషేక్ బచ్చన్, చంకీపాండేల సన్నివేశాన్ని చిత్రీకరించామని , కానీ ఫైనల్ కట్లో ఆ సన్నివేశాన్ని తొలిగించామని చిత్ర బృందం పేర్కొంది. కృతి సనన్, జాక్వలీన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ప్రచారం చిత్రాలు, ట్రైలర్ సినిమాపైన భారీ అంచనాలను పెంచుతున్నాయి. ఈయన నటించిన మరో చిత్రం ‘మిషన్ సిండ్రెల్లా’ ఓటీటీలో నేరుగా విడుదల కానున్నట్లు తెలుస్తుంది.