#90s A Middile Class Biopic | టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్
#90s A Middile Class Biopic | ఈ రోజుల్లో సినిమాకు వచ్చినంత పబ్లిసిటీ వెబ్ సిరీస్‌కు రావడం చాలా తక్కువ. ఎందుకంటే డిజిటల్ కంటెంట్ అంటే ఏదో తెలియని చిన్న చూపు అందరిలోనూ ఉంటుంది. అందులోనూ చిన్నవాళ్లు నటిస్తే అసలే పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు అంతా కొత్త వాళ్లు చేసిన ప్రాజెక్టు కూడా అదిరిపోతుంది.
#90s A Middile Class Biopic | ఈ రోజుల్లో సినిమాకు వచ్చినంత పబ్లిసిటీ వెబ్ సిరీస్‌కు రావడం చాలా తక్కువ. ఎందుకంటే డిజిటల్ కంటెంట్ అంటే ఏదో తెలియని చిన్న చూపు అందరిలోనూ ఉంటుంది. అందులోనూ చిన్నవాళ్లు నటిస్తే అసలే పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు అంతా కొత్త వాళ్లు చేసిన ప్రాజెక్టు కూడా అదిరిపోతుంది. తాజాగా 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ గురించి ఇండస్ట్రీలో ఇదే చర్చ జరుగుతుంది. సీనియర్ నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు ఊహించిన దాని కంటే పదింతలు ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. మెల్లమెల్లగా దీని అందరూ చూస్తూ సోషల్ మీడియాలో ప్రశంసించడం మొదలు పెట్టారు. దాంతో ఈ వెబ్ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
ఈ మధ్యకాలంలో వచ్చిన ది బెస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఇది ప్రత్యేకంగా రాసిన కథ కాదు.. మన కథ.. మన ఇంటి కథ. 90ల్లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ వెబ్ సిరీస్ నెక్స్ట్ లెవెల్లో కనెక్ట్ అవుతుంది. అక్కడ జరిగే ప్రతి సన్నివేశంలో తమను తాను చూసుకుంటారు. ఒంటెద్దులా ఇంటి బాధ్యత మోసే నాన్న.. ఇంట్లో భారం మోస్తూ కల్మషం లేని ప్రేమ చూపించే అమ్మ.. చాలీచాలని జీతాలు.. మధ్య తరగతి కష్టాలు.. పొద్దున్నే ఉప్మాతో పడే పాట్లు.. తమ్ముడితో చిలిపి తగాదాలు.. వాళ్ల ప్రేమలు.. స్కూళ్లలో మార్కుల కోసం యుద్దాలు.. వీకెండ్లో ఆడే బెట్ మ్యాచులు.. ఇంట్లో చెప్పకుండా వెళ్లే పార్టీలు.. మార్కులు తక్కువగా వచ్చినప్పుడు నాన్నతో తిన్న తన్నులు.. స్కూల్లో మన మొదటి ప్రేమ.. ఇలా ఒక్కటేంటి ప్రతి ఒక్కటి వెబ్ సిరీస్‌లో కనెక్ట్ అవుతాయి.
వీటన్నింటిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాడు దర్శకుడు ఆదిత్య హాసన్. ఎక్కడ ఏ చిన్న డీటెయిల్ కూడా మిస్ చేయలేదు. దాంతో ఇంకా ఎక్కువగా కనెక్ట్ అవుతుంది ఈ సిరీస్. మధ్య తరగతి స్కూల్ టీచర్ పాత్రలో శివాజీ పూర్తి న్యాయం చేశాడు.. భార్యగా, అమ్మగా వాసుకి అద్భుతంగా నటించారు.. మౌళి, రోహన్, వాసంతిక నటన బాగుంది. ముఖ్యంగా రోహన్ నటన అయితే నెక్స్ట్ లెవెల్. సోషల్ మీడియాలో మనోడి క్లిప్పింగ్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. దానికి చూడు రోహన్ పై వచ్చే సాంప్రదాయని సుబ్బిని అంటూ సాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా వైరల్ అవుతుంది. ఆదిత్య హాసన్ డైరెక్షన్ ఆకట్టుకుంటుంది.. ఓవరాల్ గా 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్.. డోన్ట్ మిస్ ఇట్.. ఇది మన కథే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

