చాందిని పాత్రలో ఆకట్టుకుంటా
శ్రీరామ్, అవికాగోర్ జంటగా నటిస్తున్న సినిమా ‘10 క్లాస్ డైరీస్’. ఈ చిత్రాన్ని అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు, పి రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ‘గరుడవేగ’ అంజి దర్శకుడు. జూలై 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను తెలిపింది నాయిక అవికా గోర్.
ఆ రోజులు గుర్తొస్తాయి
ఈ సినిమాతో మీ అందరికి పదో తరగతి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మీతో చదువుకున్న విద్యార్థులంతా తిరిగి కలిస్తే ఎలాంటి భావోద్వేగాలు కలుగుతాయి అనేది సినిమాలో దర్శకుడు అంజి చూపించారు. ఇప్పటిదాకా మీరు చూసిన పాటలు, ట్రైలర్లో లేని కొత్త విషయాలు సినిమాలో ఉంటాయి. ఈ కథ నాటకీయంగా సాగుతూనే వినోదాన్ని అందిస్తుంది. నా చిత్రాలు కొత్తగా ఉంటాయని చెబుతారు. ఇదీ అలాంటి అనుభూతినే అందిస్తుంది. చిన్నప్పటి నుంచి నటిస్తుండటం వల్ల ఒక వైపు షూటింగ్స్ చేస్తూనే మరోవైపు పరీక్షలు రాశాను. నేను స్కూల్‌కు వెళ్లింది తక్కువ.
చాందినిగా ఆకట్టుకుంటా
ఈ సినిమాలో చాందిని అనే క్యారెక్టర్లో నటించాను. కథలో నా పాత్ర కీలకంగా ఉంటుంది. నా పాత్ర చుట్టూ సినిమా తిరుగుతుంది. ఆమె పాత్రలో ఒక సస్పెన్స్ పెట్టారు దర్శకుడు. ఆమె ఎక్కడుంది, ఏం చేస్తుంది, బతికుందా లేదా అనేది తెలుసుకునేందుకు సహ విద్యార్థులు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నమంతా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీరామ్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. మా మధ్య ఎకువ సన్నివేశాలు ఉండవు. ఆయనతో నటించినప్పుడు ఎంతో నేర్చుకున్నాను. అంజి స్పష్టత ఉన్న దర్శకుడు. సినిమాటోగ్రాఫర్ కావడంతో విజువల్స్ బాగా తీశారు.
అతని వల్లే ఈ మార్పు
మిళింద్‌తో ప్రేమలో ఉన్నప్పటి నుంచి నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను ఏం చేయగలనో తెలిసింది. బరువు తగ్గడం నుంచి నిర్మాతగా మారడం వరకూ… నా ప్రతి అడుగులో మిళింద్ ఉన్నాడు. నేను హిందీ సీరియల్స్ చేస్తుండటం వల్ల తెలుగు సినిమాలు చేయలేకపోతున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

