పదో తరగతి జ్ఞాపకాల్లో
శ్రీరామ్, అవికాగోర్ జంటగా నటిస్తున్న సినిమా ‘10 క్లాస్ డైరీస్’. ఈ చిత్రాన్ని అజయ్ మైసూర్ సమర్పణలో అచ్యుత రామారావు, పి. రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ‘గరుడవేగ’ అంజి దర్శకుడు. జూలై 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా జరిగిన కార్యక్రమంలో చిత్ర విశేషాలు తెలిపారు దర్శకుడు అంజి. ఆయన మాట్లాడుతూ.. ‘సినిమాటోగ్రాఫర్‌గా ఇది నాకు 50వ సినిమా. ‘గరుడ వేగ’ సినిమా నాకు మంచి పేరు తీసుకొచ్చింది. కెరీర్లో చాలా మంది దర్శకులతో కలిసి పనిచేసిన అనుభవంతో దర్శకుడిగా అడుగువేశాను. ఈ సినిమాతో పాటు ‘బుజ్జీ ఇలా రా’ అనే చిత్రాన్నీ తెరకెక్కించాను. లాక్డౌన్ వల్ల ఈ రెండు సినిమాలు విడుదల ఆలస్యమయ్యాయి. ‘10 క్లాస్ డైరీస్’ విషయానికొస్తే కొన్నేళ్ల తర్వాత తిరిగి కలుసుకున్న పదో తరగతి విద్యార్థుల కథ ఇది. వినోదం, భావోద్వేగాల కలయికగా తెరకెక్కించాం.
ఈ కథలో శ్రీరామ్, అవికా ఇలా..ఎవరెవరు నటించాలని కోరుకున్నామో వాళ్లంతా సినిమాకు అంగీకరించి నటించారు. మానసికంగా పరిణితి చెందిన వ్యక్తి పాత్రలో శ్రీరామ్ కనిపిస్తారు. పక్కింటి అమ్మాయి అనిపించేలా అవికా గోర్ క్యారెక్టర్ ఉంటుంది. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ నుంచి ఆమె మన తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఈ ఇమేజ్ కోసమే ఆమెను తీసుకున్నాం. రీయూనియన్‌కు అంతా వస్తారు కానీ ఒక అమ్మాయి రాదు. ఆమే గతంలో హీరో ప్రేమించిన అమ్మాయి. ఆమె ఎక్కడుంది, ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం ప్రారంభిస్తారు. సినిమాలో ఈ అంశం సస్పెన్స్‌గా ఉంటుంది. సినిమాటోగ్రాఫర్‌ను కాబట్టి విజువల్స్ కోసం ఆరాటపడలేదు. కథను బలంగా చెప్పే ప్రయత్నం చేశాం. మా సినిమాకు హీరో ధనుష్, నిఖిల్..ఇలాంటి వాళ్లంతా ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఇకపైనా సినిమాటోగ్రాఫర్‌గా కొనసాగుతాను. మంచి కథ కుదిరితే దర్శకత్వం వహిస్తా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

