Zee Vs Invesco | గతంలో ఏం చేశారు.. ఇన్వెస్కోపై జీ సీఈవో ఫైర్
Zee Vs Invesco | ఇన్వెస్కో గతంలో కార్పొరేట్ గవర్నెన్స్ గురించి ఎందుకు నోరు మెదపలేదని జీ సీఈవో పునీత్ గోయెంకా ప్రశ్నించారు.

Zee Vs Invesco | జీ ఎంటర్టైన్మెంట్ ఎండీ కం సీఈవో పునీత్ గోయెంకా గురువారం నోరు విప్పారు. జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు గైడెన్స్ మేరకు ఇకముందు సంస్థ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జీ ఎంటర్టైన్మెంట్ ఎండీగా పునీత్ గోయెంకాను తొలగించాలని, మొత్తం బోర్డును పునర్వ్యవస్థీకరించాలని సంస్థలో అతిపెద్ద వాటాదారు ఇన్వెస్కో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పునీత్ గోయెంకా స్పందించడం గమనార్హం.
ఇప్పటికే సోనీలో విలీనానికి జీ ఎంటర్టైన్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ నేపథ్యంలో పునీత్ గోయెంకా తీరుపై ఇన్వెస్కో ఆరోపణలు గుప్పిస్తున్నది. ఇంతకుముందు సంస్థలో కార్పొరేట్ గవర్నెన్స్ గురించి ఇన్వెస్కో ఎందుకు మాట్లాడలేదని పునీత్ గోయెల్ ప్రశ్నించారు. ఫిబ్రవరి లేదా మార్చిలో రిలయన్స్‌లో జీ ఎంటర్టైన్మెంట్ విలీనం ప్రస్తావన ఎందుకు తేలేదని నిలదీశారు. ఇన్వెస్కో, జీ ఎంటర్టైన్మెంట్ మధ్య విభేదాల వల్లే జీని తమ సంస్థలో విలీన చర్చలపై వెనక్కు తగ్గామని రిలయన్స్ బుధవారం పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- invesco
- punit goenka
- zee
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

