Hyundai Venue | మార్కెట్లోకి హ్యుండాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్.. ధరెంతంటే?!
Hyundai Venue | మారుతి బ్రెటా, టాటా మోటార్స్ నెక్సన్, కియా సొనెట్లతో పోటీ పడనున్నది కియా న్యూ ఫేస్‌లిఫ్ట్ కారు.
Hyundai Venue | దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) గురువారం తన కొత్త మోడల్ కంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ కారును ఆవిష్కరించింది. సబ్-4 ఎస్యూవీ సెగ్మెంట్లో మార్కెట్లోకి ఎంటరైన వెన్యూ పేస్లిఫ్ట్ కారు ధర రూ.7.53 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు మూడు పవర్ట్రైన్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తున్నది. మారుతి సుజుకి బ్రెటా, టాటా మోటార్స్ నెక్సన్, కియా సొనెట్ తదితర మోడల్ కార్లతో తలపడనున్నది. 1.2 లీటర్ల పెట్రోల్ ట్రిమ్ మోడల్ కారు ధర రూ.7.53 లక్షల నుంచి మొదలవుతుంది. 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం గల వెన్యూ ఫేస్‌లిఫ్ట్, వెన్యూ డీజిల్ వేరియంట్ రూ.9.99 లక్షలు పలుకుతున్నాయి.
హ్యుండాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ ఎండీ కం సీఈవో యున్‌సూ కిమ్ గురువారం వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్లో ఆవిష్కరించారు. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని అభివృద్ధి చేశామన్నారు. బ్రాండ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ, కస్టమర్లను ఉద్వేగానికి గురు చేస్తుందని తెలిపారు. పాత వర్షన్ కారులో 11 సెగ్మెంట్స్ ఫీచర్లు, డిజైన్లు ఇతర మార్పులు 40కి పైగా కొత్త మోడల్లో ఉన్నాయని చెప్పారు.
ఇంటి లోపలి నుంచే వెన్యూ ఫేస్‌లిప్ట్ కారుపై కంట్రోల్ కలిగి ఉండేలా 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు జత కలిశాయని హ్యుండాయ్ ఒక ప్రకటనలో వివరించింది. హోం టు కారు (హెచ్2సీ), అలెక్సా, గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హోం 2 కారు (హెచ్2సీ) వల్ల కారు స్టేటస్ తెలుసుకోవచ్చు. రిమోట్ క్లైమేట్ కంట్రోల్, రిమోట్ రోడ్ లాక్/ అన్‌లాక్, రిమోట్ వెహికల్ స్టేటస్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

