TVS Ronin Special Edition | టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ బైక్ లాంచింగ్..!
TVS Ronin Special Edition | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్.. దేశీయ మార్కెట్లోకి ‘టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్’ ఆవిష్కరించింది. దీని ధర రూ.1.73 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
TVS Ronin Special Edition | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్.. దేశీయ మార్కెట్లోకి ‘టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ (TVS Ronin Special Edition)’ ఆవిష్కరించింది. దీని ధర రూ.1.73 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. పండుగల సీజన్ నేపథ్యంలో కస్టమర్లలో ఆసక్తిని పెంపొందించేందుకు టీవీఎస్ రోనిన్ ఆవిష్కరించామని తెలిపింది టీవీఎస్ మోటార్స్.
స్టాండర్డ్ వర్షన్ రోనిన్ మోటారు సైకిల్‌తో పోలిస్తే టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ న్యూ నింబస్ గ్రే షేడ్ విత్ డిఫరెండ్ బాడీ గ్రాఫిక్స్‌తో రూపుదిద్దుకున్నది. బేస్‌పై గ్రే షేడ్‌తో ట్రిపుల్ టోన్ కలర్ స్కీమ్ తో వస్తుంది. ఫ్యుయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్ పై రెడ్ స్ట్రైప్స్ ఉంటాయి. బ్లాక్ కలర్లో ఫినిష్డ్ హెడ్ ల్యాంప్ బెజెల్, వీల్ రిమ్స్ అమర్చారు. యూఎస్బీ చార్జర్ విజర్, డిఫరెన్షియల్లీ డిజైన్డ్ ఈఎఫ్ఐ కవర్ తదితర ఫీచర్లు జత చేశారు.
టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ మోటారు సైకిల్ 225.9 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ మోటార్ తో వస్తుంది. 7750 ఆర్పీఎం వద్ద 20.1 బీహెచ్పీ విద్యుత్, 3750 ఆర్పీఎం వద్ద 19.93 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్, 41 ఎంఎం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్స్, రేర్‌లో 7-స్టెప్ అడ్జస్టబుల్ మోనోసాక్, ఫ్రంట్‌లో 300 ఎంఎం, రేర్‌లో 240 ఎంఎం డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.
డ్యుయల్ చానెల్ ఏబీఎస్ కూడా ఉంటుంది. టీ-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ తదితర ఫీచర్లు ఉన్నాయి. టూ రైడింగ్ మోడ్స్- రైన్, అర్బన్ మోడ్స్ విత్ అడ్జస్టబుల్ లివర్స్తోపాటు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

