TVS RAIDER 125 | తొలి మెటావర్స్ బైక్.. టీవీఎస్ రైడర్ 125.. ధరెంతంటే?!
TVS RAIDER 125 | మార్కెట్లోకి ప్రముఖ టూ వీలర్స్ సంస్థ టీవీఎస్ తన తొలి మెటావర్స్ బైక్ రైడర్ 125 తెచ్చింది.
TVS RAIDER 125 | ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ టీవీఎస్.. న్యూ బ్లూటూత్ కనెక్టివిటీ మోడల్ ‘రైడర్ 125’ బైక్‌ను దేశీయ మార్కెట్లో బుధవారం ఆవిష్కరించింది. 125 సీసీ బైక్‌లో న్యూ 5- అంగుళాల ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసి గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌తో ఈ బైక్ కంట్రోల్ చేయొచ్చు. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 99,999 నుంచి ప్రారంభం అవుతుంది. 5.9 సెకన్లలో 60 కి.మీ. స్పీడ్ దూసుకెళ్లగలడం దీని స్పెషాలిటీ. టీవీఎస్ తన మెటావర్స్ ప్లాట్‌ఫామ్ మోటోవర్స్లో రైడర్ 125 బైక్‌ను ఆవిష్కరించింది. గేమింగ్ గ్రాఫిక్స్ తరహాలో యూజర్లు వాడొచ్చు. ఆధునిక ప్రపంచంలో డిజిటల్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్‌ను డిజైన్ చేశారు. మెటావర్స్ ప్లాట్‌ఫామ్‌పై డిజైన్ చేసిన తొలి బైక్ రైడర్ 125.
టీఎఫ్టీ కన్సోల్‌లో బ్లూ టూత్ కనెక్టివిటీ లభ్యం అవుతుంది. కారులో మాదిరిగా ఇన్ఫోటైన్మెంట్ ఉంటుంది. టీఎఫ్టీ కనెక్టివిటీ ఉంటుంది. ఇంతకుముందు ఎన్‌టార్క్ స్కూటీలో ఇటువంటి కనెక్టివిటీ ఫీచర్లు జత చేసింది. హెల్మెట్ కనెక్టెడ్ బ్లూటూత్ సాయంతో వాయిస్ కమాండ్స్ ఇవ్వొచ్చు. ఫ్యూయల్ ఎప్పుడు అయిపోతుందో, వర్ష రాక సూచన, మ్యూజిక్ ప్లేయింగ్ ఆప్షన్ నోటిఫికేషన్లు పొందొచ్చు. మ్యాప్ నేవిగేషన్, నోటిఫికేషన్ కంట్రోల్ తదితర ఫీచర్లు ఉంటాయి. పెట్రోల్ అయిపోయినా సమీప పెట్రోల్ పంప్ స్టేషన్‌ను నావిగేట్ చేయొచ్చు. చేతుల్లో గేమింగ్స్ యాప్ ఉన్నంత ఫీల్ కలుగుతుంది. ఈ బైక్ ఫైర్రీ ఎల్లో, విక్డ్ బ్లాక్ కలర్స్‌లో ఈ బైక్ లభ్యం అవుతుంది.
లెఫ్ట్ హ్యాండ్ బటన్‌తో వాయిస్ కమాండ్స్ ఇవచ్చు. రైట్ హ్యాండ్ బటన్‌తో మెనూ ఓపెన్ చేయొచ్చు. బటన్ సాయంతో కాల్ రిజెక్ట్ చేయొచ్చు. బైక్ నడుపుతున్నప్పుడు వాయిస్ కమాండ్‌తో మీకు అవసరమైన లొకేషన్స్, సమీప రెస్టారెంట్లు, పెట్రోల్ పంపుల సమాచారం తెలుసుకోవచ్చు. ఈ బైక్ పెట్రోల్ ట్యాంక్‌లో 10 లీటర్ల పెట్రోల్ నింపుకోవచ్చు. 5-స్పీడ్ గేర్ బాక్స్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫోర్క్స్, మొనోషాక్, బ్రాస్ టైప్ ఫ్రంట్ డిస్క్స్, రేర్ డ్రమ్ బ్రేక్స్ ఫీచర్లు ఉన్నాయి. దీని ఇంజిన్ 11.2బీహెచ్పీ ఇంధనం ఉత్పత్తి చేస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

