Toyota Taisor | ముంబై, ఏప్రిల్ 3: దేశీయ మార్కెట్‌కు నయా ఎంట్రీ లెవల్ ఎస్యూవీ అర్బన్ క్రూజర్ టైజర్‌ను పరిచయం చేసింది టయోటా. రూ.7.73 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.13.03 లక్షల గరిష్ఠ ధరతో ఈ మాడల్‌ను విక్రయిస్తున్నది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి.
ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్ మోటర్ డిప్యూటీ ఎండీ తాజాషీ అసజుమా మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ప్రీమియం మాడళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని మాడళ్లను ఈ విభాగంలో ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఇప్పటికే ఇన్నోవా, ఫార్చ్యూనర్ మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. కస్టమర్లు అవసరాలకు అనుగుణంగా మాడళ్లను తీర్చిదిద్దుతున్నట్లు, త్వరలో మరిన్ని మాడళ్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవలకాలంలో దేశీయ కస్టమర్లు చిన్న కార్ల నుంచి పెద్ద కార్లవైపు ఆసక్తి చూపుతున్నారు.