ఇకపై ఈడీఎల్ఐ గరిష్ఠ ప్రయోజనం రూ.7 లక్షలు

పెంపును అమల్లోకి తెచ్చిన కేంద్ర కార్మిక శాఖ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఎంప్లాయీస్ డిపాజిట్ అనుసంధాన బీమా (ఈడీఎల్ఐ) పథకం-1976 కింద గరిష్ఠ ప్రయోజనం పెరిగింది. రూ.6 లక్షల నుంచి 7 లక్షలకు పెంచుతూ ఉద్యోగ భవిష్యనిధి ఈపీఎఫ్‌వో ట్రస్టీల కేంద్ర బోర్డు గతేడాది సెప్టెంబర్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తమ మంత్రిత్వ శాఖ అమల్లోకి తెచ్చిందని, ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన కూడా విడుదలైందని గంగ్వార్ పీటీఐకి గురువారం తెలిపారు. దీంతో ఉద్యోగులకు లాభం చేకూరినైట్లెంది. కాగా, నిరుడు ఫిబ్రవరి 14 తర్వాత కూడా ఈ పథకం కింద కనీస ప్రయోజనంగా రూ.2.5 లక్షలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో ట్రస్టీల కేంద్ర బోర్డు తెలిపింది. నిజానికి ఫిబ్రవరి 14తోనే ఈ ప్రయోజనం కాలపరిమితి తీరిపోయింది. కానీ ఇప్పుడు దాన్ని పొడిగించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- EDLI Scheme
- India
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

