అంతా వట్టిదే!

- టాటా గ్రూప్ నాయకత్వంలో ఎలాంటి నిర్మాణాత్మక మార్పుల్లేవ్
- టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ స్పష్టం
- తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన రతన్ టాటా
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: టాటా గ్రూప్ నాయకత్వంలో ఎటువంటి నిర్మాణాత్మక మార్పుల్లేవని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ బుధవారం స్పష్టం చేశారు. టాటా గ్రూప్‌లో మునుపెన్నడూ లేనివిధంగా నాయకత్వ నిర్మాణ మార్పులు జరుగబోతున్నాయని బ్లూంబర్గ్లో వచ్చిన వార్తలపై ఆయన పైవిధంగా తేల్చిచెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్‌ను మెరుగుపర్చడానికి ప్రత్యేకంగా ఓ సీఈవో స్థానాన్నే తీసుకురావాలనే యోచనలో టాటా గ్రూప్ ఉన్నట్లు బ్లూంబర్గ్ సదరు కథనంలో పేర్కొన్నది. అంతేగాక ప్రస్తుత చైర్మన్‌కు తర్వాతి హోదాలో ఈ కొత్త సీఈవో ఉంటారని చెప్పింది. ఈ క్రమంలో ఇలాంటి నిర్ణయాలు అషామాషీగా జరుగవని, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ బోర్డు నిర్ణయిస్తుందని చంద్రశేఖరన్ ఓ తాజా ప్రకటనలో వివరించారు. ఇలాంటి వార్తలు సంస్థలో గందరగోళం సృష్టిస్తాయని, పనితీరును ప్రభావితం చేస్తాయన్న ఆయన బ్లూంబర్గ్ వార్తపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. టాటా ట్రస్టుల అధిపతి రతన్ టాటా సైతం ఇటువంటి వదంతులు ఎంతమాత్రం మంచివి కావంటూ తన అసంతృప్తిని కనబర్చారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
Siddipeta | పోలీసుల దిగ్బంధనంలో సిద్దిపేట.. ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
Jasprit Bumrah | టెస్టుల్లో బుమ్రా అరుదైన రికార్డు.. అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్-10 భారత బౌలర్ల జాబితాలో చోటు..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

