Starlink | త్వరలో భారత్‌లో ప్రారంభం కానున్న స్టార్‌లింక్ సేవలు.. కిట్, అన్లిమిటెడ్ డేటా ధరలు ఎంతో తెలుసా..?
Starlink | ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్లింగ్ సేవలు త్వరలో భారత్‌లో ప్రారంభం కానున్నాయి. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుంచి జీఎంపీసీఎస్ (గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్) లైసెన్స్ పొందిన కంపెనీ.. ప్రస్తుతం భారత్‌లో సార్లింక్ సేవలను ప్రారంభించేందుకు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి.
Starlink | ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్లింగ్ సేవలు త్వరలో భారత్‌లో ప్రారంభం కానున్నాయి. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నుంచి జీఎంపీసీఎస్ (గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ శాటిలైట్) లైసెన్స్ పొందిన కంపెనీ.. ప్రస్తుతం భారత్‌లో సార్లింక్ సేవలను ప్రారంభించేందుకు పూర్తిస్థాయిలో జరుగుతున్నాయి. అయితే, స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ ధర, ప్రరణాళిక సంబంధించి ఓ కీలక నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ నివేదిక ప్రకారం స్టార్ లింక్ ప్రైమరీ సెటప్ కిట్ భారత్‌లో రూ.33వేలకు అందుబాటులో ఉండనున్నది. ఇందులో స్టార్‌లింక్ డిష్, కిక్‌స్టాండ్, జెన్ 3 రౌటర్, స్టార్‌లింక్ కేబుల్, ఏసీ కేబుల్, విద్యుత్ సరఫరా కేబుల్స్ ఉండనున్నట్లు తెలుస్తున్నది.
ఈ కిట్‌ను ప్రత్యేకంగా గృహ వినియోగదారుల కోసం రూపొందించినట్లు తెలుస్తున్నది. వీడియో కాల్స్, స్ట్రీమింగ్, ఆన్లైన్ గేమింగ్ వంటి రోజువారీ ఇంటర్నెట్ వినియోగానికి ఈ కిట్ అనుకూలంగా ఉండనున్నది. నివేదిక ప్రకారం.. స్టార్‌లింక్ అపరిమిత డేటా ప్లాన్ నెలవారీ ధర రూ.3వేల నుంచి రూ.4200 వరకు ఉండొచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఎలాన్ మస్క్ కంపెనీ మార్చిలో ప్రముఖ భారతీయ టెలికాం కంపెనీలైన ఎయిర్టెల్, రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకన్నది. నివేదిక ప్రకారం.. స్టార్‌లింక్ హార్డ్‌వేర్ కిట్లను ఈ కంపెనీల రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయించే అవకాశం ఉంది. జియో, ఎయిర్టెల్ స్టార్‌లింక్ లో-ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని యాక్సెస్ చేయలేని.. మారుమూల ప్రాంతాల్లోనూ వేగవంతమైన, యాక్సెస్ చేయగల ఇంటర్నెట్ను అందించనున్నది. ప్రస్తుతం స్టార్‌లింక్‌కు 7వేల ఉపగ్రహాలు ఉండగా.. భవిష్యత్‌లో వీటి సంఖ్యను 40వేలకు పెంచాలని మస్క్ కంపెనీ ప్రణాళిక రూపొందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

