Skoda Superb | స్కోడా ప్రీమియం సెడాన్ సూపర్బ్ రీఎంట్రీ.. సీబీయూగా ఆవిష్కరణ..!
Skoda Superb | చెక్ రిపబ్లిక్ ఆటో జెయింట్ స్కోడా.. భారత్ మార్కెట్లోకి తన ప్రీమియం సెడాన్ కారు ‘స్కోడా సూపర్బ్’తో రీ ఎంట్రీ ఇచ్చింది.
Skoda Superb | చెక్ రిపబ్లిక్ ఆటో జెయింట్ స్కోడా.. భారత్ మార్కెట్లోకి తన ప్రీమియం సెడాన్ కారు ‘స్కోడా సూపర్బ్ (Skoda Superb)’తో రీ ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.54 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. బీఎస్-6 రెండో దశ కర్బన ఉద్గార నిబంధనలను అమలు చేయాలని కేంద్రం నిర్దేశించడంతో ఏడాది క్రితం సూపర్బ్‌ను భారత్ మార్కెట్ నుంచి ఉపసంహరించింది. అయితే స్కోడా తన సూపర్బ్ కారును కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా ఆవిష్కరించింది. కేవలం 100 యూనిట్లు మాత్రమే విక్రయిస్తుంది. ఈ నెలాఖరులో డెలివరీలు ప్రారంభిస్తుంది.
స్కోడా సూపర్బ్ సింగిల్ వేరియంట్ గానే వస్తు్న్నది. లారిన్ అండ్ క్లెమెంట్ వర్షన్లో భారత్ కర్బన ఉద్గారాల నిబంధనకు అనుగుణంగా 2.0 లీటర్ల ఫోర్ సిలిండర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది. 7-స్పీడ్ డీసీటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 187 బీహెచ్పీ విద్యుత్, 320 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
స్కోడా సూపర్బ్ మూడు ఎక్స్ టీరియర్ కలర్ ఆప్షన్లు – రోసో బ్రూనెల్లో, వాటర్ వరల్డ్ గ్రీన్, మ్యాజిక్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. వాషర్లతోపాటు ఫుల్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, బంపర్‌పై ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, 18-అంగుళాల ప్రొపస్ ఏరో అల్లాయ్ వీల్స్, డైనమిక్ టర్న్ ఇండికేటర్లతో ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఫ్రంట్ ఫెండర్స్ మీద లారిన్ అండ్ క్లెమెంట్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది.
స్కోడా సూపర్బ్ న్యూ 10.2 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, 9.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ కంపాటిబుల్ విత్ వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార ప్లే, వైర్ లెస్ చార్జింగ్, ట్రై జోన్ క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లు జత చేశారు. నైన్ ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్లలో డ్రౌజీనెస్ డిటెక్షన్, 360-డిగ్రీ కెమెరా, యాక్టీవ్ చేసిస్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, పార్క్ అసిస్ట్ విత్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ అసిస్ట్ తదితర ఫీచర్లు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

