Skoda Kushaq Matte Edition | ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా.. భారత్ మార్కెట్లో స్కోడా కుషాక్ ఎస్ యూవీ మాట్టె లిమిటెడ్ ఎడిషన్ ఎస్యూవీ ఆవిష్కరించింది. కేవలం 500 యూనిట్లు మాత్రమే విక్రయిస్తామని తెలిపింది. దీని ధర రూ.16.19 లక్షలు (ఎక్స్ షోరూమ్ ధర)గా నిర్ణయించారు.
ఆల్-న్యూ స్కోడా కుషాక్ ఎడిషన్ పాపులర్ కార్బన్ స్టీల్ పెయింటెడ్ ఇన్ మాట్టె ఫినిష్ తో వస్తున్నది. ఔటర్ రేర్ వ్యూ మిర్రర్స్ (ఓఆర్వీఎంస్), డోర్ హ్యాండిల్స్, రేర్ స్పాయిలర్, గ్లాసీ బ్లాక్ అసెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. గ్రిల్లె, ట్రంక్ గార్నిష్, విండో గార్నిష్ ఫీచర్లు కొత్తగా జత చేశారు.
స్కోడా కుషాక్ మాట్టె ఎడిషన్ సిక్స్ స్పీకర్స్ అండ్ సబ్ వూఫర్ సౌండ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. క్యాబినెట్లో 25.4 సీఎం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్ లెస్ స్మార్ట్ లింక్ ఫర్ సీమ్ లెస్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ ఫీచర్ ఉంది. ఎంక్యూబీ-ఏఓ- ఐఎన్ ప్లాట్ ఫామ్ ఆధారంగా రూపుదిద్దుకున్న ఎస్యూవీ స్కోడా కుషాక్ మాట్టె ఎడిషన్ కారు. ఈ కారుకు గ్లోబల్ ఎన్-క్యాప్ ఫైవ్ స్టార్ క్రాష్ రేటింగ్ ఇచ్చింది.