హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యధిక సంఖ్యలో స్టార్టప్‌లు విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహించేలా చేయడంలో టీ హబ్‌లోని ల్యాబ్ 32 యాక్సిలరేటర్ కీలకంగా వ్యవహరిస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్త స్టార్టప్‌లను ఎంపిక చేసి, వాటికి అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నది. ఇప్పటి వరకు 7 దశల్లో సుమారు 250 స్టార్టప్‌లకు అవసరమైన సహాయ సహకారాలను అందించగా.. తాజాగా ఇటీవల నిర్వహించిన ల్యాబ్ 32 కోహర్ట్ 8 కార్యక్రమం కింద 15 కొత్త స్టార్టప్‌లను ఎంపిక చేసినట్లు టీ హబ్ నిర్వాహకులు తెలిపారు. వీటిలో బోల్ట్రాన్, డ్రోన్ సర్వీస్ అగ్రిగేటర్ డ్రోయ్, ఈవీ పాప,ఎక్సెల్లీ, గోజార్స్, గ్రోపిటల్, హెల్త్యాప్, హర్త్హెల్త్, ఇన్స్టాలాజిస్ట్, న్యూరల్ సింక్, పర్పుల్ రిబ్బన్, సెగ్రీ టెక్, షిప్‌మంత్ర వంటి స్టార్టప్‌లు ఉన్నాయని తెలిపారు.