SBI Loan Offers 2021 | వివిధ రుణాలపై ఎస్బీఐ ఆఫర్ల వర్షం ఇలా.. !
SBI Loan Offers 2021 | పండుగల వేళ ఎస్బీఐ తన ఖాతాదారులకు రుణాలపై పలు ఆఫర్లు అందిస్తున్నది. అయితే, యోనో యాప్ ద్వారా అప్లయ్ సుకోవాలి

SBI Loan Offers 2021 | పండుగల వేళ దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ.. తన రిటైల్ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. కారు, బంగారం, పర్సనల్ లోన్స్‌పై ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఖాతాదారులు తమ sbi.co.in లాగిన్ అయి సదరు పథకాలు, వాటి ప్రాసెస్ తెలుసుకోవచ్చునని ట్వీట్ చేసింది. కారు కొనుగోలు దారులకు రూ.లక్షపై రూ.1539లకే లోన్ మంజూరు చేస్తోంది. ఇక బంగారంపై రుణానికి ఏడాదికి 7.5 శాతం వడ్డీ అందిస్తున్నది. అలాగే వివిధ అవసరాలకోసం రూ.1832 నెల వాయిదాకే రూ.లక్షపర్సనల్ లోన్ ఆఫర్ చేస్తోంది.
యోనో యాప్ ద్వారా అప్లయ్ చేయాల్సిందే
అయితే, ఖాతాదారులు తప్పనిసరిగా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్బీఐ తెలిపింది. sbiyono.sbiలోనూ లాగిన్ అయి లోన్ దరఖాస్తు సమర్పించొచ్చు. ఇంతకుముందు ఇంటి రుణాలపై కల్పిస్తున్న ఆఫర్లను ట్విట్టర్ హ్యాండిల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటి రుణాలపై ఆఫర్లను గుర్తు చేసింది.
పండుగల సీజన్లో యోనో ఎస్బీఐ ద్వారా ఇంటి రుణానికి దరఖాస్తు చేసుకునే వారు ఎస్బీఐ హోంలోన్‌తో సంబురాలు చేసుకోండి.. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి home loans.sbi వెబ్‌సైట్‌కు వెళ్లండి అని ట్వీట్లో పేర్కొంది.
క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇలా రుణాలు..
రుణ మొత్తంతో నిమిత్తం లేకుండా క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఇచ్చే రుణాలపై 6.7 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తుంది. ఇంతకుముందు రూ.75 లక్షలు దాటిన ఇంటి రుణాలపై 7.15 శాతం వడ్డీ అమలులో ఉంది. 45 బేసిక్ పాయింట్ల వడ్డీ తగ్గితే 30 ఏండ్ల టెన్యూర్ గల రూ.75 లక్షల ఇంటి రుణంపై రూ.8 లక్షలకు పైగా రుణ గ్రహీతలకు ఆదా అవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- festival offers
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

