SBI Home Loan | ఎస్బీఐ ఇండ్ల రుణాలపై వడ్డీ రాయితీ.. మరో మూడు రోజులే..
SBI Home Loan | ఇండ్ల రుణాలు తీసుకునే వారికి ఎస్బీఐ వడ్డీరేటు, ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ కల్పిస్తున్నది. అయితే ఈ స్పెషలాఫర్ ఈ నెలాఖరుతో ముగియనున్నది.
SBI Home Loan | మీరు సొంతిల్లు కొనుక్కోవాలని డిసైడ్ అయ్యారా.. అందుకు బ్యాంకు రుణం తీసుకోవాలని భావిస్తున్నారా.. ఎస్బీఐ మీకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. వాస్తవ వడ్డీరేట్ పై 55 బేసిక్ పాయింట్లు తగ్గింపు సౌకర్యం కల్పిస్తున్నది. అయితే, ఈ రాయితీ ఈ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజులోనూ రాయితీ లభిస్తుంది.
మొత్తం ఇంటి రుణంపై (0.35%లో 50 శాతం) ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. జీఎస్టీ చెల్లింపుపై కనీసం రూ.2000, గరిష్టంగా రూ.5000 వరకూ రాయితీ లభిస్తుంది. టేకోవర్, సేల్స్, రెడీ టూ మూవ్ ఇల్లు కొనుకున్న వారికి 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తారు. ఇన్ స్టా టాపప్, రివర్స్ మార్టగేజ్, ఈఎండీ రుణాలకు మాత్రం ప్రాసెసింగ్ ఫీజు రాయితీ వర్తించదు.
రెగ్యులర్ ఇంటి రుణం ప్రాసెసింగ్ ఫీజు ఇలా
ఇంటి రుణంపై 0.35 శాతం ప్రాసెసింగ్ ఫీజు ప్లస్ జీఎస్టీ వర్తిస్తుంది. రూ.2000 నుంచి రూ.10 వేల వరకు జీఎస్టీ వర్తిస్తుంది.
ఇంటి రుణాలపై వడ్డీ రాయితీ ఇలా
మీ సిబిల్ స్కోర్ 750-800, అంతకంటే ఎక్కువగా ఉందనుకుందాం.. వాస్తవ వడ్డీరేటు 9.15 శాతం. పైన పేర్కొన్న సిబిల్ స్కోర్ ఉంటే 45 బేసిక్ పాయింట్ల రాయితీతో 8.70 శాతం వడ్డీ
700-749 మధ్య సిబిల్ స్కోర్ ఉందనుకుందాం.. వాస్తవ వడ్డీరేటు 9.35 శాతం ఉంటే.. రాయితీ ఆఫర్ కింద 55 బేసిక్ పాయింట్ల వడ్డీ తగ్గి 8.80 శాతానికి తగ్గుతుంది. ఇక సిబిల్ స్కోర్ 650-699, 550-649 మధ్య ఉంటే ఎటువంటి రాయితీ ఉండదు. 650-699 మధ్య సిబిల్ స్కోర్ కల వారికి 9.45 శాతం, 550-649 మధ్య సిబిల్ స్కోర్ గల వారికి 9.65 శాతం వడ్డీ వర్తిస్తుంది.
రీసేల్, రెడీ టూ మువ్ ప్రాపర్టీలపై ఇండ్ల రుణాలు తీసుకునే వారి సిబిల్ స్కోర్ 700 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే 20 బేసిక్ పాయింట్లు వడ్డీ రాయితీ. బిల్డర్ టై-అప్ ప్రాజెక్టుల్లో ఇల్లు కొనుక్కుంటే మరో ఐదు బీపీఎస్ వడ్డీరేటు తగ్గింపు, శౌర్య, శౌర్య ఫ్లెక్సీ కేటగిరీ ఇండ్లపై అదనంగా మరో 10 బేసిక్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. ఇక ప్రివిలేజ్, అపన్ ఘర్ క్యాటగిరీల కింద వేతన జీవులుగా ఉన్న మహిళా రుణ గ్రహీతలకు మరో ఐదు బేసిక్ పాయింట్లు వడ్డీ తగ్గుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

