SBI Credit Card | మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు (SBI Credit Card) వాడుతున్నారా.. ఈ మేరకు ఎస్బీఐ కార్డ్ తమ యూజర్లకు కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. రివార్డు పాయింట్లు రిడీమ్ చేసుకునే వారికి కొత్త సంవత్సరం జనవరి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు ( SimplyCLICK Credit Card ) యూజర్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఓచర్లు, రివార్డు పాయింట్ల రిడీమ్ విషయంలో ఎస్బీఐ కార్డ్స్ రెండు మార్పులు చేసింది.
ఇక ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్‌లో సింప్లీ క్లిక్/ సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డుతో నిర్వహించే లావాదేవీలపై వచ్చే పది రెట్ల రివార్డు పాయింట్లను ఐదు రెట్లకు తగ్గించేసింది. ఈ నిబంధన 2023 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తున్నది. క్లియర్ ట్రిప్, ఈజీడైనర్, అపోలో 24X7, బుక్ మై షో, లెన్స్‌కార్ట్, నెట్‌మెడ్స్‌లో లావాదేవీలపై మాత్రం యధావిధిగా 10 రెట్ల రివార్డు పాయింట్లు అందుకోవచ్చు.
ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ పరిమితి దాటిన యూజర్లకు ఇచ్చే క్లియర్ ట్రిప్ ఓచర్లు ఒకే ట్రాన్సాక్షన్లో రిడీమ్ చేసుకోవాలని ఎస్బీఐ కార్డ్ పేర్కొంది. ఒక ఓచర్/ ఆఫర్‌తో మరొక ఓచర్/ఆఫర్‌ను కలిపే అవకాశం ఉండదు. కొత్త ఏడాది జనవరి ఆరో తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నది. ఈ-ఓచర్ లేదా కూపన్ కోడ్ ద్వారా కస్టమర్లు గరిష్టంగా రూ.2000 డిస్కౌంట్ పొందొచ్చు.
ఇక నుంచి క్లియర్ ట్రిప్ ఓచర్/ కూపన్ కోడ్ పోయినా, చోరీకి గురైనా ఎస్బీఐ కార్డ్, క్లియర్ ట్రిప్ బాధ్యత వహించవు. www.cleartrip.comలో ఓచర్/ కూపన్ కోడ్ గానీ, దేశీయ, అంతర్జాతీయ విమానాల కోసం క్లియర్ ట్రిప్ మొబైల్ యాప్‌లో చేసే ఆన్లైన్ బుకింగ్‌లకు మాత్రమే చెల్లుబాటవుతుంది.
రెండేండ్ల లోపు పిల్లల టికెట్ బుకింగ్‌కు ఓచర్ లేదా కూపన్ కోడ్ వర్తించదు. పిల్లలతోపాటు పెద్దలు టికెట్ బుకింగ్ చేసుకుంటే ఓచర్ లేదా కూపన్ కోడ్ వినియోగించుకోవచ్చు. ఈ కూపన్ / ఓచర్ కోడ్ అందిన రోజు నుంచి నాలుగు నెలల వరకు చెల్లుబాటవుతుంది. ఈ ఆఫర్‌ను కస్టమర్ దుర్వినియోగం చేస్తే.. దాన్ని తిరస్కరించే, బుకింగ్ రద్దు చేసే హక్కు క్లియర్ ట్రిప్‌కు ఉంటుంది.
గత నెల 15 నుంచి ఎస్బీఐ కార్డ్ కొత్త ప్రాసెసింగ్ పీజు అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఈఎంఐ లావాదేవీలు, నెలవారీ క్రెడిట్ కార్డు బిల్లులపై ప్రాసెసింగ్ ఫీజు రూ.99 నుంచి రూ.199కి పెంచివేసింది. ఇక రెంటల్ పేమెంట్స్‌పై కొత్తగా రూ.99 ప్రాసెసింగ్ ఫీజు విధించింది.
ఓచర్/ కూపన్ కోడ్ రీఫండ్ చేయడం గానీ, రీప్లేస్ చేయడం గానీ, రీ వాల్యుయేట్ చేయడం గానీ, నగదు మార్పిడి చేయడం సాధ్యం కాదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఎస్బీఐ కార్డ్ https://www.sbicard.comలో తెలుసుకోవచ్చు.