Rupee Falls | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశీయ కరెన్సీకి మళ్లీ బీటలుపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, అమెరికా కరెన్సీ మరింత బలపడటంతో రూపాయి విలువ భారీ గా పడిపోయింది. ఈక్విటీ మార్కె ట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ట్రేడింగ్ అవడం కూడా రూపాయి పతనానికి పరోక్షంగా కారణమైంది.
ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 19 పైసలు తగ్గి 83.13 స్థాయికి పడిపోయింది. 83.04 వద్ద ప్రారంభమైన కరెన్సీ విలువ ఒక దశలో 83.15 కనిష్ఠ స్థాయి కి పడిపోయింది. చివరకు 19 పైసలు కోల్పోయి 83.13 వద్ద స్థిరపడింది.