Reliance Jio Special Offer | జియో రెట్టింపు ఆఫర్.. ప్రీపెయిడ్ ప్లాన్లపై డబుల్ డేటా..
Reliance Jio Special Offer |టెలికం సంచలనం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని ద్వారా రెట్టింపు...

Reliance Jio Special Offer |టెలికం సంచలనం రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని ద్వారా రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. తమ ప్రతి కస్టమర్‌కు అందుబాటు ధరలోకి రీచార్జి ప్లాన్ తేవడమే తమ లక్ష్యం అని జియో వెల్లడించింది. జియో ఫోన్ వినియోగదారుల్లో ఆరు రకాల ప్రీపెయిడ్ ప్లాన్లపై ఈ బెనిఫిట్లు లభిస్తాయి.
ఆరు ప్రీ పెయిడ్ ప్లాన్లపై ఇలా..
జియో ఫోన్ వినియోగదారులు రూ.75తో రీఛార్జ్ చేసుకుంటే అంతే మొత్తం అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్ రూ. 39, రూ. 69, రూ. 75, రూ. 125, రూ.155, రూ.185 రీఛార్జ్ ప్లాన్లకు వర్తిస్తుంది. రూ. 39తో రీఛార్జ్ చేసుకుంటే ప్రతి రోజూ అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు 100ఎంబీ ఉచిత డేటా పొందుతారు. దీని కాల పరిమితి 14 రోజులు. తాజా ఆఫర్లో 200ఎంబీ డేటాను పొందవచ్చు.
రూ.69 ప్లాన్ తీసుకుంటే ఇప్పుడు 0.5 జీబీ డేటా లభిస్తుండగా, ఇప్పుడు ఒక జీబీకి పెరుగుతుంది. రూ.75 ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు 28 రోజులూ 3జీబీ డేటా పొందేవారు ఇక 6జీబీ డేటా అందుకోవచ్చు.
రూ.125 ప్లాన్‌పై 28 రోజుల్లో ఒక జీబీ.. ఇంకా..
రూ.125 ప్రీపెయిడ్ ప్లాన్‌పై ఇప్పడు 28 రోజుల పాటు ప్రతి రోజూ 0.5జీబీ డేటా లభిస్తున్నది. ఇక ఒక జీబీ డేటా అందుకోవచ్చు. మరోవైపు రూ.155 ప్లాన్ మీద అపరిమిత కాల్స్‌తోపాటు ఒక జీబీ డేటాకు బదులు రోజూ రెండు జీబీల డేటా పొందవచ్చు. రూ.185 ప్రీ పెయిడ్ ప్లాన్‌లో ఇప్పుడు ఉచిత వాయిస్ కాల్స్‌తోపాటు 2జీబీకి బదులు 4జీబీల డేటా లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- jio
- special offer
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

