Reliance Shock To Future | ఫ్యూచర్ డీల్‌కు రిలయన్స్ బై..బై..!
Reliance Shock To Future | కిశోర్ బియానీ సారధ్యంలోని ఫ్యూచర్ రిటైల్‌తో విలీన ఒప్పందం రద్దు చేసుకున్నట్లు రిలయన్స్ ప్రకటించింది.
Reliance Shock To Future | దేశంలోని అతిపెద్ద రిటైల్ నెట్వర్క్ ఫ్యూచర్ రిటైల్‌తో చేసుకున్న విలీన ఒప్పందాన్ని ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్ రద్దు చేసుకుంది. రూ.24,713 కోట్ల చెల్లింపునకు సంబంధించిన ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందాన్ని దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ తిరస్కరించాయి. ఫ్యూచర్ రిటైల్.. దాని అనుబంధ సంస్థలకు దేశీయ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఫ్యూచర్ రుణాల బకాయి చెల్లింపుల పరిష్కారానికి చేసిన ప్రతిపాదనలు బ్యాంకర్లకు రుచించలేదు. బ్యాంకర్లు తిరస్కరించడంతో ఫ్యూచర్ రిటైల్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంఉటన్నట్లు బీఎస్ఈ ఫైలింగ్‌లో రిలయన్స్ శనివారం తెలిపింది.
మెజారిటీ వాటాదారులతోపాటు ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ తదితర సంస్థ గ్రూపులకు రుణాలిచ్చిన అన్ సెక్యూర్డ్ రుణ దాతలు అనుకూలంగా ఓటేశారు. ఐదు ఫ్యూచర్ అనుబంధ సంస్థల్లో నాల్గింటికి రుణాలిచ్చిన బ్యాంకుల్లో మెజారిటీ.. రిలయన్స్‌లో విలీనాన్ని తిరస్కరించారు. బుధవారం వాటాదారులు, గురువారం బ్యాంకర్లతో ఫ్యూచర్ అనుబంధ సంస్థలు సమావేశమయ్యాయి.
ఫ్యూచర్ విలీన ప్రతిపాదనను రిలయన్స్ తిరస్కరించడంతో కిశోర్ బియానీ సారధ్యంలోని రిటైల్ చైన్ నెట్‌వర్క్‌కు ఇక దివాళా కోర్టు పరిధిలోకి వెళ్లడమే మిగిలింది. ఇంతకుముందు ఫ్యూచర్స్ కూపన్స్‌లో వాటాల కొనుగోలు సమయంలో భవిష్యత్‌లో తమకే సంస్థను విక్రయించాలని ఫ్యూచర్ గ్రూప్‌తో అమెజాన్ ఒప్పందం చేసుకుంది. దీనికి భిన్నంగా 2020 ఆగస్టులో రిలయన్స్‌లో విలీనానికి ఫ్యూచర్ ఒప్పందంపై సంతకాలు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

